ప్రమాదవశాత్తు 10 ఎకరాల వరిగడ్డి వాములు దగ్ధం

by Jakkula Mamatha |
ప్రమాదవశాత్తు 10 ఎకరాల వరిగడ్డి వాములు దగ్ధం
X

దిశ, సంతమాగులూరు: పశుగ్రాసం కోసం ఇంటి సమీపంలో ఏర్పాటు చేసిన రెండు వరిగడ్డి వాములు ప్రమాదవశాత్తు నిప్పంటుకుని దగ్ధమయ్యాయి. ఈ సంఘటన సోమవారం బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం తంగెడుమల్లిలో చోటు చేసుకుంది. అందిన సమాచారం ప్రకారం.. గ్రామానికి చెందిన సరిమళ్ల భాస్కరరావు, నాగేష్ అనే రైతులు తమ ఇళ్ల సమీపంలో 10 ఎకరాల నుంచి సేకరించిన వరిగడ్డిని వాములు వేసి భద్రపరచుకున్నారు. అయితే సోమవారం మధ్యాహ్నం సమయంలో వరిగడ్డి వాముల వద్ద దట్టమైన పొగలు రావడం స్థానికులు గమనించారు.

వెంటనే అగ్నిమాపక సిబ్బందికి తెలిపారు. ఇరుగుపొరుగు వారు ఘటనాస్థలికి చేరుకొని మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. అయినప్పటికీ మంటలు చెలరేగి వరిగడ్డి వాములు అగ్గికి బుగ్గయ్యాయి. దీనిపై సమాచారం అందుకున్న అద్దంకి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే రెండు వాములు పూర్తిగా కాలిపోయాయి. సుమారు రూ.3 లక్షల వరకు నష్టం వాటిల్లిందని బాధిత రైతులు వాపోయారు.

Advertisement
Next Story

Most Viewed