Mp GVL Vishaka Shift: అసలు కథ ఏంటో తెలుసా?

by srinivas |   ( Updated:2022-12-12 14:05:29.0  )
Mp GVL Vishaka Shift:  అసలు కథ ఏంటో తెలుసా?
X

(దిశ ఉత్తరాంధ్ర); 2024లో విశాఖ ఎంపీ స్థానాన్ని దక్కించుకునేందుకు బీజేపీ పావులు కలుపుతోంది. ఈ క్రమంలో రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు ఇప్పటికే రాష్ట్రంలో సమస్యలతో పాటు విశాఖ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించారు. గుంటుపల్లి వెంకట లక్ష్మీ నరసింహారావు ( జీవీఎల్) పాత గుంటూరు జిల్లాకు చెందిన బల్లికురవ ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఆయన బీఎస్సీ అగ్రికల్చర్ పీజీ డిప్లమో చేశారు. వ్యాపారవేత్తగా ఆయన ఉంటూనే భారతీయ జనతా పార్టీలో ప్రముఖ పాత్ర పోషించారు. రాజ్యసభ సభ్యులుగా అనేక సమస్యలపై సభలో ప్రస్థానం తీసుకొచ్చారు.

కొన్నాళ్లుగా భారతీయ జనతా పార్టీ తరఫున కేంద్ర నిర్ణయాలను ప్రజలకి అవగాహన చేస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం విషయంలో అమరావతిని వ్యతిరేకిస్తూ ఉన్నారు. అదేవిధంగా విశాఖ ప్రజా సమస్యలపై ప్రజల గొంతుకు పెద్దల సభలో పోరాడుతున్నారు. ఇటీవల కాలంలో ప్రాధాన్యత సంతరించుకున్న స్టీల్ ప్లాంట్ విశాఖ రైల్వే జోన్ అంశాలపై కేంద్రం నిర్ణయాలను ప్రజలకు స్పష్టంగా తెలియజేసేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. 2024లో విశాఖ ఎంపీగా బీజేపీ తరఫున పోటీ చేసేందుకు అస్త్రాలను సిద్ధం చేసుకున్నారు.

జీవీఎల్ విశాఖనే ఎందుకు ఎన్నుకున్నారంటే..

విశాఖ ప్రజలు ఎప్పుడూ ఎంపీ స్థానంలో కొత్తవారు పోటీ చేసిన స్థానికేతర్లు పోటీ చేసిన సహకరించడం అణువైతిగా వస్తుంది. ఇందుకు అనేక ఉదాహరణలు చూడొచ్చు. ఈ అంశాలనన్నింటిని పూర్తిగా విశ్లేషించుకున్న రాజ్యసభ సభ్యులైన జీవీఎల్ విశాఖ ఎంపీగా బీజేపీ తరఫున ప్రజా మన్ననలు పొందేందుకు వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన అస్త్ర శస్త్రాలను పోగు చేసుకునే పనిలో ఉన్నారు.

బీజేపీ తరఫున విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు ఇప్పటికే ఆయన సమర శంఖం పూరించారు. విశాఖ సమస్యలపై పెద్దల సభలో ఎలుగెత్తి చాటుతున్నారు. న్యాయపరంగా ఏ మేరకు విశాఖకు మేలు జరుగుతుందో సమాలోచనలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ రాజధానిగా అమరావతిని వ్యతిరేకిస్తున్నారు. అటు టీడీపీ ఇటు వైసీపీని రాజకీయంగా ఎదుర్కొనేందుకు సిద్ధపడ్డారు.

అటు పార్టీ పరంగా జీవీఎల్‌కు విశాఖ నుంచి బెర్త్ ఖరారు అయిన పూర్తిస్థాయి ప్రజామోదం పొందేందుకు విశాఖ అభివృద్ధికి స్పష్టమైన వైఖరిని తెలియజేయాల్సిన అవసరం ఆయనకు ఎంతైనా ఉంది. ప్రస్తుతం ఆయన పెద్దల సభలో విశాఖ సమస్యలను వినిపిస్తున్నారు. తాజాగా విశాఖలో ఆసుపత్రుల నిర్మాణం ఆలస్యం, పరిశ్రమల పొల్యూషన్ పరిష్కారానికి రాజ్యసభలో తెలియచేశారు. మరోవైపు విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేట్ కరణ అంశంపై ఎప్పటికప్పుడే చర్చిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలకు మేలు జరిగేలా ఉంటాయని అవగాహన చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

అయితే మొత్తం మీద జీవీఎల్ విశాఖ నుంచి ఎంపీగా పోటీకి సిద్ధపడి పోతున్నారు. ఇందుకోసం బీచ్ రోడ్లో ఆయన స్వగృహాన్ని తీసుకొని గృహ ప్రవేశం కూడా చేసేసారు. ఇంకా ఎన్నికలు రావడమే తరువాయి జీవీఎల్ తన సత్తాను చాటాలనుకుంటున్నారు. ఇందుకోసం బీజేపీ శ్రేణులు సమయతమవుతున్నారు.

ఇవి కూడా చదవండి : Varahi Registration : 'వారాహి' వాహనానికి లైన్ క్లియర్

Advertisement

Next Story

Most Viewed