- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Breaking: రాజకీయానికి కొత్త సిద్ధాంతం చెప్పిన గుడివాడ అమర్నాథ్
దిశ డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ అధికార పార్టీ నేతలకు, విపక్ష పార్టీల నేతలకు మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా మీడియాతో మాట్లాడిన గుడివాడ అమర్నాథ్ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. విప్రో, ఈవీఎం, టిసిఎస్, ఇలాంటి పెద్ద సంస్థలు విశాఖలో కార్యకలాపాలు జరిపేందుకు ముందుకొస్తున్నాయని.. ఈ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద పెద్ద సంస్థలకు మధ్య చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.
వీటన్నింటిని పక్కన పెట్టి విశాఖపట్నం పైన, రాష్ట్రం పైన, జగన్మోహన్ రెడ్డి పైన బురదజల్లితే రానున్న ఎన్నికల్లో మేలు జరుగుతుంది అనుకుంటే అది టీడీపీ అమాయకత్వం అని పేర్కొన్నారు. ఇక రాజకీయ స్వలాభం కోసం, మీ పార్టీ అధికారం లోకి రావడం కోసం రాష్ట్రాన్ని, రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టడం మంచిది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక వైసీపీ పైన, జగన్మోహన్ రెడ్డి పైన మీకు అసూయా, ఓర్వలేనితనం ఉండొచ్చని.. దాని కోసం రాష్ట్రాన్ని, రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టొద్దని మీడియా ద్వారా టీడీపీని కోరుతున్నానని పేర్కొన్నారు.
ఇక ఎల్లో మీడియా రాస్తున్న వార్తలు పూర్తిగా వాస్తవానికి దూరంగా, అతి నీచాతి నీచంగా ప్రజలను అబద్దాలతో మభ్యపెట్టేవిధంగా ఉన్నాయని మండిపడ్డారు. ఇక జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం పని చేస్తున్నారని.. అలాంటి నాయకుడికి అండగా నిలబడమని ప్రజలకు మీడియా ద్వారా పిలుపునిచ్చారు. ఇక ఈ రాష్ట్రంలో ఒక్క వైసీపీతో తప్ప చంద్రబాబు నాయుడు ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదో చెప్పమని ప్రశ్నించారు.
ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీని స్వాధీనం చేసుకున్నప్పటినుండి ఇప్పటికి దాదాపు ౩౦ సంవత్సరాలు అవుతుందని.. ఈ క్రమంలో బీజేపీ, సిపిఐ, సిపిఎం, టీఆరెఎస్, జనసేన ఇలా ప్రతి పార్టీతో పొత్తు పెట్టుకున్నారని ఎద్దేవ చేశారు. ఇక వైసీపీ నుండి వెళ్లిన ఎమ్మెల్యేలకు వారి కారణాలు వాళ్లకు ఉన్నాయని.. అందుకే బయటకు వెళ్లారని పేర్కొన్నారు.
అలానే వైసీపీని వీడి వెళ్లి పార్టీ పై వైమర్శలు చేస్తున్న ఎమ్మెల్యేలు.. ఐదు సంవత్సరాలుగా ఎందుకు మాట్లాడలేదని.. పార్టీని వీడక ముందు పార్టీ తప్పు ఉంటె ఎందుకు ప్రశ్నించలేదని.. ఎమ్మెల్యేలను ప్రశించాల్సిందిగా మీడియాకు సూచించారు. ఇక వ్యక్తుల వల్ల పార్టీ కాదు.. పార్టీ వల్లే వ్యక్తులు అనే సిద్ధాంతాన్ని ఎవరైతే పాటిస్తారో వాళ్ళే రాజకీయాల్లో కొనసాగిస్తారని పేర్కొన్నారు.