అమావాస్య గండం నుంచి బయటపడుతున్న విజయవాడ

by Mahesh |   ( Updated:2024-09-03 07:30:57.0  )
అమావాస్య గండం నుంచి బయటపడుతున్న విజయవాడ
X

దిశ, వెబ్ డెస్క్: మూడు రోజుల పాటు కురిసిన భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వరదలు విలయతాండవం చేస్తున్నాయి. ముఖ్యంగా కృష్ణా నది ఉగ్రరూపం దాల్చి ప్రమాదపు స్థాయిలో ప్రవహిస్తుంది. దీనికి తోడు, మూసి, మున్నేరు వాగు పొంగి పోర్లుతుండటంతో కృష్ణ బ్యారేజీ వద్ద వరద భీకర స్థాయికి చేరుకుంది. ఈ బ్యారేజీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 11.4 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు మొత్తం 70 గేట్లను ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు విడుదల చేశారు. ఇదిలా ఉంటే అమావాస్య కారణంగా సముద్రంలో పోటు ఉండటంతో వరద నీరు వేగంగా సముద్రంలో కలవలేదు. దీంతో లంక గ్రామాలు ప్రమాదం అంచున ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ బ్రతికారు. కాగా అమావాస్య గడియలు తగ్గడం.. ఎగువ నుంచి వస్తున్న వరద తగ్గుముఖం పట్టడంతో బెజవాడకు అమావాస్య గండం కొంచెం కొంచెంగా తగ్గుతుంది. ప్రస్తుతం కృష్ష బ్యారేజీకి ప్రస్తుతం 8.94 లక్షల క్యూసెక్కుల వరద వస్తుంది. అయితే 18 గంటల్లో రెండున్నర లక్షల క్యూసెక్కుల వరద తగ్గింది. మరికొన్ని గంటల్లో వరద మరింత తగ్గుముఖం పట్టే అవకాశం ఉండటంతో దిగువ ప్రాంతం ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed