డయేరియా కట్టడిపై ప్రభుత్వం ఫోకస్ ..రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు

by srinivas |
డయేరియా కట్టడిపై  ప్రభుత్వం ఫోకస్ ..రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు
X

దిశ, వెబ్ డెస్క్: కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో డయేరియా విజృంభించిన విషయం తెలిసిందే. వాంతులు, విరేచనాలతో ఓ వ్యక్తి సైతం మరణించారు. ఇదే విధంగా రాష్ట్రంలో పలుచోట్ల డయేరియా కేసులు నమోదు అయ్యాయి. దీంతో వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. వర్షాల నేపథ్యంలో రానున్న రోజుల్లో డయేరియా ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపడుతోంది. రాబోయే మూడు నెలలపాటు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు నిర్లక్ష్యం వహించొద్దని ఆదేశించింది. డయేరియాను పర్యవేక్షించేందుకు డీహెచ్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. డయేరియా పై సమాచారం వచ్చిన వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నిరక్షిత నీటిని వినియోగించాలని, సురక్షిత లేని నీటి వనరులను తక్షణమే తనిఖీలు నిర్వహించి సర్టిఫై చేయాలని హెచ్ వోలను ఆదేశించారు.

Advertisement

Next Story