గోదావరి పుష్కరాలపై ఫోకస్.. కుంభమేళా ఏర్పాట్లను పరిశీలించిన నారాయణ టీమ్

by srinivas |   ( Updated:2025-02-24 17:33:13.0  )
గోదావరి పుష్కరాలపై ఫోకస్.. కుంభమేళా ఏర్పాట్లను పరిశీలించిన నారాయణ టీమ్
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో గోదావరి 2027లో గోదావరి పుష్కారాలు జరగనున్నాయి. దీంతో ప్రభుత్వం ఇప్పటి నుంచే దృష్టి సారించింది. గతంలో తొక్కిసలాట జరిగి పలువురు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ సారి భక్తుల భద్రత ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా ప్రయాగ్ రాజ్ కుంభమేళా ఏర్పాట్లను అధ్యయనం చేయాలని నిర్ణయించింది. కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు చేస్తున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు, ఏర్పాట్లు చేసిందనేది అధ్యయనం చేయాలని కమిటీని నియమించింది. మంత్రి నారాయణ ఆధ్వర్యంలో పలువురు మున్సిపల్ అధికారులను నియమించింది. ఈ మేరకు ప్రయాగ్ రాజ్ కుంభమేళా వద్దకు వెళ్లాలని ఆదేశించింది.

దీంతో మంత్రి నారాయణ టీమ్ ఈ రోజు ఉదయం ప్రయాగ్ రాజ్ కుంభమేళా ప్రాంతానికి వెళ్లింది. కుంభమేళాలో ప్రభుత్వం చేపట్టిన ఏర్పాట్లు, భక్తుల వసతులపై అధ్యయనం చేసింది. కుంభమేళా అథారిటీ కార్యాలయాన్ని టీమ్ సభ్యులు సాయంత్రం సందర్శించారు. కుంభమేళా ఏర్పాట్లు, భక్తుల రద్దీ, ట్రాఫిక్ నియంత్రణ, భద్రత చర్యలపై ఆరా తీశారు. అక్కడి అధికారులతో కలిసి స్నాన ఘాట్లలను పరిశీలించారు. స్నాన ఘాట్ల ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎంతమంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎలా హ్యాండిల్ చేయగలిగారనే అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఏపీలో జరిగే గోదావరి పుష్కరాలను అక్కడి అధికారులకు వివరించారు. భద్రత విషయంలో చేపట్టాల్సిన చర్యలను మంత్రి నారాయణ టీమ్ సభ్యులు అడిగి తెలుసుకున్నారు.

Next Story