దేవాదాయ శాఖ శాంతిపై విజిలెన్స్ విచారణ.. ఆదేశాలు జారీ

by srinivas |
దేవాదాయ శాఖ శాంతిపై విజిలెన్స్ విచారణ.. ఆదేశాలు జారీ
X

దిశ ప్రతినిది, విశాఖపట్నం: వివాదాస్పద దేవాదాయ శాఖ అధికారిణి కె. శాంతి వ్యవహారాలపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు అదేశించింది. ఇప్పటికే పలు ఆరోపణలతో సస్పెండ్ అయిన ఆమె వైసీపీ ప్రభుత్వ హాయాంలో పెద్ద ఎత్తున అన్యాయాలు, అక్రమాలు, అవినీతికి పాల్పడిందంటూ వచ్చిన ఆరోపణలపై విజిలెన్స్ ఎన్పోర్సెమెంట్ విభాగం విచారణకు అదేశిస్తూ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నిర్ణయం తీసుకొన్నారు. తన భార్య శాంతి కన్న బిడ్డకు తండ్రి ఎవరో తేల్చేందుకు వైసీపీ రాజ్యసభ సభ్యుడు పి.విజయసాయి రెడ్డి, హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాది సుభాష్ రెడ్డిలకు డీ‌ఎన్‌ఏ పరీక్షలు చేయాలంటూ ఆమె భర్త ఆరోపణలు, ఫిర్యాదులు చేసిన సంగతి తెలిసిందే.

విశాఖలో పలు ఆరోపణలు

రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అండతో శాంతి విశాఖ దేవాదాయ శాఖ సహాయ కమిషనర్‌గా పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగంతో అక్రమాలు, అన్యాయాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. కొత్తగా దేవాదాయ శాఖలో చేరిన ఆమెకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన విజయసాయి రెడ్డి ఏకంగా నాలుగు పోస్టులు ఆమెకు కట్టబెట్టారు. విశాఖ కనకమహాలక్ష్మీ దేవస్ధానంతోపాటు పలు ఆలయాల్లో శాంతి అవినీతికి పాల్పడ్డరానే ఫిర్యాదులు ప్రభుత్వానికి అందాయి. మూడు సంవత్సరాల లీజ్‌కు ఇవ్వాల్సిన దేవాదాయ శాఖ భూములను కారు చౌకగా11 సంవత్సరాల లీజ్‌కు ఆమె కట్టబెట్టారు. వీటన్నింటిపై విచారణ జరుగనుంది.



Next Story