Amaravati: వచ్చే నెలలోనే అసెంబ్లీ సమావేశాలు..!

by srinivas |   ( Updated:2023-08-30 17:44:09.0  )
Amaravati: వచ్చే నెలలోనే అసెంబ్లీ సమావేశాలు..!
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో వర్షాకాల అసెంబ్లీ సమావేశాలకు ప్రభుత్వ వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి. సెప్టెంబర్ మూడో వారంలో దాదాపు 10 నుంచి 15 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సమావేశాల నిర్వహణ, షెడ్యూల్‌పై అధికారిక ప్రకటన ఇవ్వాల్సి ఉంది. నాలుగైదు రోజులు అటు, ఇటుగా కచ్చితంగా సెప్టెంబర్‌ నెలలోనే సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. సమావేశాలకు ముందే కేబినెట్ భేటీ అయి అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టాల్సిన బిల్లులు, అంశాలపై చర్చించనున్నారు. వైఎస్ జగన్ సెప్టెంబర్ తొలివారంలో విదేశీ పర్యటనకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి కోరారు. సీబీఐ కోర్టు అనుమతిస్తే ఆయన పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత సమావేశాలు ప్రారంభిస్తారని సమాచారం. సెప్టెంబర్‌లోనే వినాయక చవితి ఉండటంతో ఆ పండుగ తర్వాత సమావేశాలు ప్రారంభించాలనే ప్రతిపాదనలు ఇప్పటికే ప్రభుత్వానికి చేరినట్లు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Advertisement

Next Story

Most Viewed