Nara Bhuvaneshwari : మంచి ఎప్పటికైనా నిలుస్తుంది..నిజం తప్పక గెలుస్తుంది

by Seetharam |   ( Updated:2023-10-27 08:46:16.0  )
Nara Bhuvaneshwari : మంచి ఎప్పటికైనా నిలుస్తుంది..నిజం తప్పక గెలుస్తుంది
X

దిశ, డైనమిక్ బ్యూరో : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ పై 'నిజం గెలవాలి' అని ప్రజలతో కలిసి పోరాడుతున్నా అని నారా భువనేశ్వరి అన్నారు. ఈ క్రమంలో ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు జనం చూపుతున్న ఆదరణ, కురిపించే ప్రేమ ఈ కష్ట సమయంలో మాకు ఎంతో ఊరటనిస్తోంది అని తెలిపారు. వారిచ్చే మద్దతు ఎంతో ధైర్యాన్నిస్తోందని ట్వీట్ చేశారు. తనను కలిసిన ప్రజలు చంద్రబాబు పాలనలో జరిగిన మంచి గురించి, నేటి రాక్షస పాలనలో పడుతున్న ఇబ్బందుల గురించి వివరించారని తెలిపారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వేలాది మందికి ఉపాధి కల్పించిన టీసీఎల్ సంస్థ ప్రతినిధులు కలిసి చంద్రబాబు చొరవతో ఈ సంస్థ ఏర్పాటు అయిందని చెప్పినప్పుడు ఎంతో గర్వపడ్డానని అన్నారు. ఇవన్నీ చూశాక మంచి ఎప్పటికైనా నిలుస్తుందని..నిజం తప్పక గెలుస్తుందని మరింత దృఢంగా చెప్పగలుగుతున్నా అని భువనేశ్వరి అన్నారు.

Advertisement

Next Story

Most Viewed