తిరుమల వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. పండుగ సందర్బంగా ప్రత్యేక రైళ్లు

by Javid Pasha |   ( Updated:2023-10-18 07:21:11.0  )
తిరుమల వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. పండుగ సందర్బంగా ప్రత్యేక రైళ్లు
X

దిశ, వెబ్‌డెస్క్: దసరా పండుగ వస్తున్న వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. తెలుగు రాష్ట్రాల మధ్య పలు స్పెషల్ ట్రైన్లను అందుబాటులోకి తెచ్చింది. వీటికి ఇప్పటికే రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తుండగా.. ప్రయాణికులు బుక్ చేసుకోవచ్చని రైల్వేశాఖ సూచిస్తోంది. పండుగ ముగిసేంతవరకు ఈ ప్రత్యేక ట్రైన్ సర్వీసులను తిప్పనున్నారు.

పండుగ సెలవులు రావడంతో చాలామంది తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళుతుంటారు. దీంతో తిరుపతికి రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను తీసుకొచ్చింది. సికింద్రాబాద్-తిరుపతి-సికింద్రాబాద్(07489/07490) ప్రత్యేక రైలు 19,20వ తేదీల్లో తిప్పనున్నారు. కాచిగూడ, ఉదానగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల్, రాయచూర్, మంత్రాలయం, అదోని, గుంతకల్, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట స్టేషన్లలో ఆగనుంది. నర్సాపూర్-వికారాబాద్-నర్సాపూర్(07453/07454) ట్రైన్‌ను అందుబాటులోకి తీసుకురాగా.. ఇది పాలకొల్లు, భీమవరం జోన్, భీమవరం టౌన్, ఆకువీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, , నల్లగొండ, సికింద్రాబాద్, బేగంపేట, లింగంపల్లి స్టేషన్లలో ఆగనుంది.

అలాగే సికింద్రాబాద్-కాకినాడ(07271/07272) రైలు 20,21వ తేదీలలో సర్వీసులు అందించనుంది. 20న రాత్రి 9 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి ఉదయం 8 గంటలకు కాకినాడకు వెళుతుంది. 21న రాత్రి 8.10 గంటలకు కాకినాడలో తిరుగు పయనమై మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ ట్రైన్లలో జనరల్, స్లీపర్ క్లాసులతో పాటు ఏసీ కోచ్‌లు ఉండనున్నాయి.

Advertisement

Next Story

Most Viewed