ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్..వైసీపీ మేనిఫెస్టోలో మరికొన్ని కీలక అంశాలు

by Jakkula Mamatha |
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్..వైసీపీ మేనిఫెస్టోలో మరికొన్ని కీలక అంశాలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో వచ్చె నెల 13న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఎన్నికలకు చాలా తక్కువ సమయం ఉండటంతో అధికార, విపక్ష పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కాగా, ఇప్పటికే నామినేషన్ల దాఖలు పూర్తి అయిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో సీఎం జగన్ శనివారం (ఏప్రిల్ 27) వైసీపీ మేనిఫెస్టోని విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ..ఐదేళ్ల పాలనలో ఇచ్చిన హామీలను అన్నింటిని నెరవేర్చడం ఆనందంగా ఉందన్నారు.

ఎన్నికల వేళ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుంది అన్నారు. కోవిడ్ సమయంలో కూడా ప్రతి పథకం అమలు చేశామని అన్నారు. మేనిఫెస్టో అమలుకు ఎన్ని సమస్యలు వచ్చినా చిరు నవ్వుతో ప్రజలకు తోడుగా ఉన్నామని చెప్పారు. తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయంలో మేనిఫెస్టోను ఆవిష్కరించారు. ఇందులో భాగంగా విద్య, వైద్యం, వ్యవసాయం, పేదలందరికీ ఇళ్లు, నాడు నేడు, మహిళా సాధికారత, సామాజిక భద్రతకు పెద్దపీట వేశారు.

వీటితో పాటు మేనిఫెస్టోలో మరికొన్ని కీలక అంశాలు చేర్చారు. అవి ఏంటంటే..మత్స్యకార భరోసా కింద ఐదు విడతల్లో రూ.50 వేలు అందజేస్తామని చెప్పారు. ‘వాహన మిత్ర’ ఐదేళ్లలో రూ. 50 వేల నుంచి లక్ష రూపాయలకు పెంపు. ఆటో, క్యాబ్ ,లారీ డ్రైవర్లకు రూ.10 లక్షల ప్రమాద బీమా. 2025 నుంచి ఒకటో తరగతి ఐబీ సిలబస్. 500 మంది దళితులు ఉంటే ప్రత్యేక గ్రామ పంచాయతీగా గుర్తింపు. అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీ కాలనీలకు ఉచిత కరెంట్‌ ఇస్తామని మేనిఫెస్టోలో వివరించారు.

Advertisement

Next Story

Most Viewed