AP News:దివ్యాంగ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

by Jakkula Mamatha |   ( Updated:2024-09-26 08:16:13.0  )
AP News:దివ్యాంగ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం దిశగా అడుగులు వేస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల పై సీఎం చంద్రబాబు(CM Chandrababu) ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు దివ్యాంగ విద్యార్థులకు(Disabled students) శుభవార్త చెప్పారు. వసతి గృహాలు, గురుకులాల్లో చదువుకునే దివ్యాంగ విద్యార్థులకు ప్రతి నెల పింఛను(Pension) కోసం ఇళ్లకు వెళ్లడం దూరాభారమై ఏళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వారి బ్యాంకు ఖాతాల్లోనే పింఛను నగదు జమ చేయాలని ప్రభుత్వం(Government) నిర్ణయించింది. ఈ క్రమంలో నవంబరు 1 నుంచి వీరికి అకౌంట్లలోనే డబ్బులు వేయనున్నారు. మొత్తంగా ఏపీలో 8.50 లక్షల మంది ఈ కోటాలో పింఛను పొందుతున్నారు. ఇందులో 10 వేల మంది విద్యార్థులు(Students) ఉన్నట్లు గుర్తించారు.

Advertisement

Next Story