పోటెత్తిన గోదావరి.. జలదిగ్బంధంలో 75 లంక గ్రామాలు

by srinivas |
పోటెత్తిన గోదావరి.. జలదిగ్బంధంలో 75 లంక గ్రామాలు
X

దిశ, వెబ్ డెస్క్: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కురిసిన భారీ వర్షానికి గోదావరి నది పోటెత్తి ప్రవహిస్తోంది. భారీగా వచ్చి చేరుతున్న ప్రవాహంతో లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుపోయాయి. దాదాపు 40 గ్రామాల్లో వర్షపు నీరు చేరింది. ఇళ్లలో నీళ్లతో పాటు బురద పేరుకుపోయింది. దాదాపు 3500 ఇళ్లు ముంపులో చిక్కుకున్నాయి. ఎటు చూసినా గ్రామాలు చెరువులను తలపిస్తు్న్నాయి. వేల ఎకరాల్లో వరి, ఉద్యాన పంటలు నీటిలో మునిపోయాయి. చాలా చోట్లు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. 16 వేలకు పైగా కుటుంబాలపై వరద ప్రభావం చూపింది. నిత్యాసరాలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో పడవలపై ప్రయాణం చేస్తున్నారు. ముమ్మిడివరం మండలం గరజాపులంక,కూనలంక,లంక ఆఫ్ టానే లంక, చింతపల్లి లంక గ్రామాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు రైతులు సైతం తీవ్ర అవస్థలు పడుతున్నారు. పశువులకు సైతం మేత దొరకని పరిస్థితి నెలకొంది. మెరక ప్రాంతాల్లో మేకలు, గేదెలను కట్టివేశారు. లోతట్టు ప్రాంతాలన్ని జలమయం అయ్యాయి. మరో అడుగుల మేర నీళ్లు వస్తే భారీ నష్టం తప్పదని రైతులు వాపోతున్నారు. కోనసీమ జిల్లాలో 75 లంక గ్రామాల్లో వరద ఉధృతి కొనసాగుతోంది. 12 మండలాలపై వరద ప్రభావం చూపింది. ధవళేశ్వరం వద్ద రెడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.

Advertisement

Next Story