- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో భోగి వేడుకలు.. నేడు గోదాదేవి కళ్యాణం
దిశ వెబ్ డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి.రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తొలి రోజు భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 7 శనివారాలు వెంకటేశ్వర స్వామి దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం అనే నినాదంతో ప్రసిద్ధికెక్కిన వాడనపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి పరిచయం అవసరం లేదు. ఈ రోజు భోగి సందర్భంగా ఈవో మదునూరి సత్యనారాయణ రాజు భోగిమంటను వెలిగించి భోగి వేడుకలను ప్రారంభించారు.
సత్యనారాయణ రాజు ఆధ్వర్యంలో తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇక ఈరోజు నిర్వహించిన భోగిమంటల్లో గోవింద నామాన్ని స్మరించుకుంటూ భారీ ఎత్తు భోగి పిడకల దండను భోగిమంటల్లో ఆలయ సిబ్బంది సమర్పించారు. ఇక పురాణాల ప్రకారం గోదాదేవి కళ్యాణం మకరసంక్రాంతి ముందు రోజు జరిగిందని అందుకు ప్రతీకగా ప్రతి సంవత్సరం భోగి రోజు గోదాదేవి కళ్యాణం నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం ఆలయం లోనూ గోదాదేవి కళ్యాణం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున భక్తులు ఆలయానికి తరలి వస్తున్నారు.