దేవుడు ఉన్నాడు.. నాకు దారి చూపిస్తాడు : నారా భువనేశ్వరి

by Seetharam |   ( Updated:2023-09-25 09:31:16.0  )
దేవుడు ఉన్నాడు.. నాకు దారి చూపిస్తాడు : నారా భువనేశ్వరి
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఊపిరి ప్రజలేనని నారా భువనేశ్వరి అన్నారు. చంద్రబాబు నాయుడు సింహంలా గర్జించి బయటకు వస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడు ఎలాంటి తప్పు చేయలేదు అని అన్నారు. చంద్రబాబు నాయుడు 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ ఎలాంటి తప్పు చేయలేదని అన్నారు. చంద్రబాబు నాయుడు ప్రజల మనిషి అని అందరికీ తెలుసునని భువనేశ్వరి అన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్‌కు నిరసనగా టీడీపీ నేతలు చేపట్టిన దీక్షా శిబిరానికి ఆమె వెళ్లారు. టీడీపీ నేతలు చేపట్టిన దీక్షకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా భువనేశ్వరి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తనతోపాటు ఈ రాష్ట్ర ప్రజలను ముందుకు తీసుకుని వెళ్లాలని చంద్రబాబు నాయుడు పరితపించే వారు అని అన్నారు. నేనూ ఓ కంపెనీని నడుపుతున్నా. అందులో 2 శాతం అమ్ముకున్నా నాకు రూ.400 కోట్లు వస్తాయి. ప్రజల సొమ్ము మాకు అక్కర్లేదు. మా కుటుంబమంతా ఎన్టీఆర్‌ అడుగుజాడల్లో నడుస్తున్నాం. ప్రజల కోసం మా కుటుంబం ఎప్పుడూ ఉంటుంది. మాకు ఎలాంటి కోరికలు లేవు.. ఉన్నంతలో తృప్తి పడతాం. తాను సంపద సృష్టించే వ్యక్తినని భువనేశ్వరి చెప్పుకొచ్చారు. అంతేకాదు ఎన్టీఆర్ ట్రస్ట్‌ను నిర్వహిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ ట్రస్ట్ ద్వారా వందల కోట్ల వ్యవయంతో ప్రజలకు మంచి చేస్తున్నట్లు వెల్లడించారు. కోసం ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. రాళ్లతో ఉన్న హైటెక్ సిటీలాంటి ప్రాంతాన్ని చంద్రబాబు నాయుడు ఒక చక్కటి శిల్పంగా మార్చారు అని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ బాటలోనే చంద్రబాబు నాయుడు నడుస్తున్నారని చెప్పుకొచ్చారు. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు ఎలాంటి తప్పు చేయలేదని అయినా 17 రోజులు నిర్బంధించారని భువనేశ్వరి అన్నారు.

కుటుంబం కన్నా ప్రజలే ముఖ్యం

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ప్రజల కోసమే ఆలోచించేవారని భువనేశ్వరి అన్నారు. రాత్రింబవళ్లు ప్రజల కోసం పనిచేసిన వ్యక్తిని జైల్లో నిర్బంధించారు. చంద్రబాబు ఏ తప్పూ చేయలేదు. ప్రజల కోసం ఆయన జైలుకెళ్లారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సంస్థ వల్ల చాలా మంది ఉపాధి పొందారు. కుటుంబం ఏమైనా పర్వాలేదు తనకు ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తే ముఖ్యం అని పరితపించే వారని చెప్పుకొచ్చారు. తన తండ్రి ఎన్టీఆర్ దేవుడు అని చెప్పుకొచ్చారు. తన తండ్రి ఎన్టీఆర్ అడుగు జాడల్లోనే చంద్రబాబు పనిచేస్తూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని భావించేవారని అన్నారు. మహిళా శక్తి ఎంతో గొప్పదని అన్నారు. అలాంటి మహిళా శక్తి తనకు అండగా ఉండటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తాను దేవుడిని నమ్ముతున్నానని తనకు దేవుడు దారి చూపిస్తాడన్న నమ్మకం ఉందని భువనేశ్వరి చెప్పుకొచ్చారు. మరోవైపు చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా తమకు మద్దతు తెలిపేందుకు ఐటీ ఉద్యోగులు తరలి వచ్చారంటేనే తన భర్త ఎలాంటి తప్పు చేయలేదని తెలుస్తోందని అన్నారు. ఐటీ ఉద్యోగులు తమకు సంఘీభావం తెలిపేందుకు వస్తే పోలీసులు అడ్డుకున్నారని అన్నారు. ఐటీ ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేశారని చెప్పుకొచ్చారు. ఐటీ ఉద్యోగులు ఏమైనా టెర్రరిస్టులా అని భువనేశ్వరి ప్రశ్నించారు. తెలంగాణ నుంచి ఏపీకి రావడానికి వీసా, పాస్‌పోర్టు కావాలా? ఇదెక్కడి ప్రజాస్వామ్యం అని ప్రశ్నించారు. యువతకు ఉపాధి కల్పించడం చంద్రబాబు నాయుడు చేసిన తప్పా అని భువనేశ్వరి నిలదీశారు. చంద్రబాబు నాయుడు ఏ తప్పూ చేయలేదని నారా భువనేశ్వరి ధీమా వ్యక్తం చేశారు.

Read More..

చంద్రబాబుతో భువనేశ్వరి,బ్రహ్మణిల ములాఖత్: అచ్చెన్నాయుడు సైతం..

Advertisement

Next Story