Viral News: సైకో పోవాలి.. సైకిల్ రావాలంటూ నెట్టిన్ట్లో అమ్మాయిల హల్చల్..

by Indraja |
Viral News: సైకో పోవాలి.. సైకిల్ రావాలంటూ నెట్టిన్ట్లో అమ్మాయిల హల్చల్..
X

దిశ వెబ్ డిస్క్: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి అటు పార్టీ నేతల్లోనే కాదు.. ఇటు అభిమానుల్లోనూ కనిపిస్తూంది. అమ్మాయిలు, అబ్బాయిలు అని తేడాలేదు. ప్రతి ఒక్కరు ఎదో ఒక నాయకుడికి అభిమానిగా మారిపోతున్నారు నేటి యువత. ఏ పార్టీ అభిమానులు ఆ పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలను విమర్శిస్తూనే ఉన్నారు. కొందరు ట్రోల్ల్స్ చేస్తుంటే ఇంకొందరు షార్ట్స్, సాంగ్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అలాంటి సాంగ్ ఒకటి నెట్టింట్లో చక్కెర్లు కొడుతోంది. తెలుగుదేశం పార్టీని సమర్ధిస్తూ సైకిల్ రావాలి.. సైకో పోవాలి పాటకు కొందరు అమ్మాయిలు స్టెప్పులు వేశారు.

వాళ్ళు డాన్స్ చేసిన పాటను నెట్టింట్లోకి వదిలారు. దీనితో ఆ పాట వైరల్ గా మారింది. ముద్దుగుమ్మలు వేసిన స్టెప్స్ చూసిన వారంతా ఫిదా అవుతున్నారు. అయితే ప్రతి విషయంలో మంచి చెడు రెండు ఉన్నట్లు.. ఈ బామలు వేసిన స్టెప్పులు చూసిన వాళ్ళలో పలువురు పలురకాలుగా స్పందిస్తున్నారు. కొందరు పాజిటివ్ గా స్పందిస్తే మరికొందరు విమర్శల జల్లు కురిపిస్తున్నారు. ఏదేమైనా పాట మాత్రం వైరల్ గా మారింది. ఆ వీడియో మీరు చూసేయండి.



Advertisement

Next Story