- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Ganta: ఆయన ప్రధాని ఎందుకు అవ్వకూడదు..? ఎమ్మెల్యే కొడుకు సంచలన వ్యాఖ్యలు

దిశ, వెబ్ డెస్క్: నారా లోకేష్(Nara Lokesh) అన్నయ్య పీఎం(PM) ఎందుకు అవ్వకూడదు? అని మాజీమంత్రి, భీమిలీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు(Ganta Srinivasa Rao) కుమారుడు(Son) గంటా రవితేజ(Ganta Raviteja) అన్నారు. ఆయన ఇవాళ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. నారా లోకేష్ నాలాంటి ఎంతో మంది యువతకు స్పూర్తి ఆయన లాంటి వారు రాజకీయాల్లో ఉండి ప్రజలకు సేవ చేయాల్సిన అవసరం చాలా ఉందని తెలిపారు. గతంలో యూఎస్ లో చదువుకునే రోజుల్లో ఢిల్లీలో లోకేష్ అన్నయ్యను చాలా సాదాసీదాగా చూశానని, కానీ ఏపీ రాజకీయాల్లో(AP Politics) గేమ్ ఛేంజర్(Game Changer) అవుతారని అనుకోలేదని చెప్పారు.
ఇటీవలే విద్యావ్యవస్థలో ఆయన తెస్తున్న మార్పులను చూస్తున్నామని, మిడ్ డే మీల్స్ విషయంలో ఆయన సీరియస్ యాక్షన్ తీసుకొని అమలు చేయడం జరిగిందన్నారు. అంతేగాక టీడీపీ పార్టీ(TDP Party) సభ్యత్వం తీసుకున్న వారికి ప్రీమియం 2 లక్షల నుంచి 5 లక్షలకు పెంచారని, ఈ నిర్ణయానికి లోకేష్ అన్నకి హ్యాట్సాఫ్ చెప్పారు. ఇక రాబోయే రోజుల్లో నారా లోకేష్ లాంటి రాజకీయ నాయకుడు మనకు చాలా అవసరమని అన్నారు. అందరూ డిప్యూటీ సీఎం అంటున్నారు కానీ నారా లోకేష్ అన్న పీఎం కావాలి. ఏదో ఒకరోజు లోకేష్ ను ప్రధాన మంత్రిగా చూడాలని నా కోరిక అని రవితేజ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.