గత ప్రభుత్వ భూ దందాలు, సహజవనరుల దోపిడీపై నాలుగో శ్వేతపత్రం

by Mahesh |
గత ప్రభుత్వ భూ దందాలు, సహజవనరుల దోపిడీపై నాలుగో శ్వేతపత్రం
X

దిశ, వెబ్‌డెస్క్: 2024 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించి అధికారంలోకి వచ్చిన కూటమి.. గత ప్రభుత్వం చేసిన అవినీతి అక్రమాలపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఆయా విభాగాలు, శాఖలపై ప్రభుత్వం శ్వేతపత్రాలను విడుదల చేస్తుంది. ఇందులో భాగంగా సోమవారం మధ్యాహ్నం సీఎం చంద్రబాబు.. ప్రభుత్వ భూదందాలు, సహజవనరుల దోపిడీపై నాలుగో శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలోని విలువైన ఖనిజ సంపదను దోచేశారని.. వైసీపీ నేతలు అడవులను కూడా ధ్వంసం చేశారని.. ఇళ్ల స్థలాల పేరుతో భూ దోపిడీకి పాల్పడ్డారని, ఇష్టానుసారం భూములను ఆక్రమించారని సీఎం చెప్పుకొచ్చారు. అలాగే.. రీసర్వే పేరుతో భూముల హద్దులు మార్చేశారని.. విశాఖ మాజీ ఎంపీ హయగ్రీవ భూములు కాజేశారని తెలిపారు. అలాగే వైసీపీ నాయకులు తమ అక్రమాలతో వృద్ధాశ్రమాలను కూడా వదిలిపెట్టలేదని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.



Next Story