ప్లాష్.. ప్లాష్.. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు రాజీనామా..

by Mahesh |   ( Updated:2023-02-16 06:44:40.0  )
ప్లాష్.. ప్లాష్.. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు రాజీనామా..
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ బీజేపీ‌కి షాక్ తగిలింది. ఆ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, సీనియర్ నాయకుడైన కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న కన్నా.. బీజేపీ నిర్ణయాలపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన పార్టీని వీడుతున్నారని పలు సందర్భాల్లో వార్తలు వచ్చాయి. దీంతో ఎట్టకేలకు కన్నా పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. అలాగే రాష్ట్ర నాయకత్వం సరిగ్గా లేకపోవడం వలనే తాను పార్టీని వీడుతున్నట్లు తెలిపారు. దీంతో పాటు తన అనుచరులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ చేపడతానని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed