- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరి కాసేపట్లో రేవంత్, చంద్రబాబు భేటీ.. కొత్త డిమాండ్ తెరపైకి తెచ్చిన మాజీ మంత్రి బొత్స
దిశ, వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పదేండ్లుగా అపరిష్కృతంగా ఉన్న రాష్ట్ర విభజన సమస్యలపై చర్చేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ కాబోతున్నారు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని ప్రజా భవన్ వేదికగా ఈ సమావేశం జరగనుంది. తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ ప్రారంభానికి ముందే వైసీపీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ట్విట్టర్ వేదికగా కీలక డిమాండ్ చేశారు. ‘‘విభజన సమస్యల పరిష్కారానికి ఇవాళ 2 రాష్ట్రాల సీఎంల సమావేశం నేపథ్యంలో పోర్టుల్లో, టీటీడీ ఆస్తుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాటాలు కోరుతున్నట్టుగా వస్తున్న వార్తలు AP ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. పారదర్శకతకోసం, ప్రజలకు వాస్తవాలు తెలియడానికి ముఖ్యమంత్రుల సమావేశాన్ని ప్రత్యక్షప్రసారం చేస్తే బాగుంటుందని నా సూచన. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటారని భావిస్తున్నాను’’ అని బొత్స ట్వీట్ చేశారు. కాగా, సీఎం రేవంత్, చంద్రబాబుల భేటీని లైవ్ టెలికాస్ట్ చేయాలని బొత్స కోరడం చర్చనీయాంశం మారింది.