ఏపీ మాజీ గవర్నర్‌కు అస్వస్థత.. హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు

by Jakkula Mamatha |
ఏపీ మాజీ  గవర్నర్‌కు అస్వస్థత.. హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు
X

దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), ఛత్తీస్‌గఢ్(Chhattisgarh) రాష్ట్రాల మాజీ గవర్నర్(Former Governor) బిశ్వభూషణ్ హరిచందన్(Biswabhusan Harichandan) నేడు(మంగళవారం) అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను హుటహుటిన ఒడిశా(Odisha)లోని భువనేశ్వర్‌(Bhubaneswar)లో ఉన్న ఓ ఆసుపత్రికి(Hospital) తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్(Hyderabad) తరలించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన కుమారుడు పృథ్వి రాజ్ హరిచందన్(Prudhvi Raj Harichandan) (ఒడిశా న్యాయ శాఖ మంత్రి) తెలిపారు. 2019 నుంచి 2023 వరకు బిశ్వభూషణ్ హరిచందన్ ఏపీకి గవర్నర్‌గా సేవలు అందించారు.

Advertisement

Next Story