వైసీపీలో ప్రతి ఎంపీ, ఎమ్మెల్యే... జగన్ విడిచిన చెప్పులే: అంబటి రాయుడు

by srinivas |   ( Updated:2024-05-02 15:48:29.0  )
వైసీపీలో ప్రతి ఎంపీ, ఎమ్మెల్యే... జగన్ విడిచిన చెప్పులే: అంబటి రాయుడు
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీలో బానిసత్వం తప్ప మరొకటి లేదని మాజీ క్రికెటర్ అంబటి రాయుడు అన్నారు. గుంటూరు జిల్లాలో జనసేన తరపున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అంబటి రాయుడు మాట్లాడుతూ ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా జగన్ కాలి కింద చెప్పులా బ్రతకాల్సిందేనని చెప్పారు. బటన్ నొక్కడం తప్ప అభివృద్ధి చేతకాదని ఎద్దేవా చేశారు.. బటన్‌తో పాటుగా బొచ్చె కూడా ఇస్తాడని వ్యాఖ్యానించారు. వైసీపీలో ఉన్నా ఎవరూ ఏమీ చేయలేరని, అక్కడ పవర్ అంతా జగన్ చేతిలోనే ఉంటుందని అంబటి రాయుడు తెలిపారు. జగన్‌కి మళ్ళీ అధికారం ఇస్తే పాతాళానికేనని హెచ్చరించారు. క్రీడారంగాన్ని సైతం నిర్వీర్యం చేశారని మండిపడ్డారు.. సమర్ధవంతమైన నాయకుడిని ఎన్నుకోవాలని.. ఎన్నికల్లో సిక్స్ కొట్టండని అంబటి రాయుడు పిలుపునిచ్చారు. దేశంలోని రాష్ట్రాలన్నీ ముందుకు వెళ్తుంటే ఏపీ మాత్రం వెనక్కి పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో రాష్ట్రానికి ఒక పరిశ్రమ కూడా రాలేదని మండిపడ్డారు. ప్రతి హామీని పవన్ నెరవేర్చతారని చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి 20 ఏళ్లు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కూటమితో రాష్ట్రాభివృద్ధి సాధ్యమని అంబటి రాయుడు పేర్కొన్నారు.

Advertisement

Next Story