Ys Jagan: అదీ తప్పేనా.. సరస్వతి భూములపై స్పందించిన జగన్

by srinivas |   ( Updated:2024-11-07 12:06:22.0  )
Ys Jagan: అదీ తప్పేనా.. సరస్వతి భూములపై స్పందించిన జగన్
X

దిశ, వెబ్ డెస్క్: పల్నాడులోని సరస్వతి పవర్ భూముల(Saraswati Power Lands)పై మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former CM Jagan Mohan Reddy) స్పందించారు. రైతులు అడిగినా దాని కంటే ఎక్కువే ఇచ్చే తీసుకున్నామని ఆయన తెలిపారు. సిమెంట్ ఫ్యాక్టరీ పెడతామంటే కరెంట్, నీరు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యతని, అదీ కూడా తప్పేనా అని ప్రశ్నించారు. ఒక్క ఎకరం భూమి కూడా ప్రభుత్వానిది కాదని తెలిపారు. సరస్వతి భూములు విషయంలో అక్రమాలు జరగలేదని, ఆ భూములన్నీ పట్టా భూములేనని స్థానిక ఎమ్మెర్వో చెప్పినట్లు జగన్ తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) ఆదేశాలతోనే సరస్వతి పవన్ భూముల్లో స్థానిక ఎమ్మార్వో సర్వే చేశారని తెలిపారు.

ఈడీ అటాచ్‌మెంట్ వల్లే సరస్వతి భూముల్లో సిమెంట్ ఫ్యాక్టరీ కట్టలేకపోయామని జగన్ పేర్కొన్నారు. తప్పుడు కేసులు వేసి ఫ్యాక్టరీ నిర్మాణం జరగక్కుండా అడ్డుకుంది తమరే కదా అని ప్రశ్నించారు. కడపలో జిందాల్ స్టీల్ ఫ్యాక్టరీ పెడుతుంటే బెదిరిస్తున్నారని, రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా అడ్డుపడుతున్నారని జగన్ మండిపడ్డారు. నారా లోకేశ్ రెడ్ బుక్‌పైనా జగన్ స్పందించారు. రెడ్ బుక్ లోకేశ్ ఒక్కరేకాదని, ప్రజలు కూడా రాసుకుంటున్నారని తెలిపారు. వచ్చే తమ ప్రభుత్వమేనని, అప్పుడు ఎంత దూరంలో ఉన్నా బయటకు లాక్కొస్తామని మాజీ సీఎం జగన్ హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed