- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఢిల్లీ కంటే ఏపీలో అతిపెద్ద లిక్కర్ స్కామ్: మాజీ CM కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజకీయాల్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంచలనం సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆప్ కీలక నేతలు అరెస్ట్ అయ్యి తీహార్ జైలులో ఉన్నారు. ఇదిలా ఉండగానే.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌పై ఏపీ మాజీ సీఎం, రాజాంపేట పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే ఆంధ్రప్రదేశ్‌లోనే పెద్ద స్కామ్ జరిగిందన్నారు. ఏపీలో జరిగిన లిక్కర్ స్కామ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే చాలా పెద్దదని సంచలన ఆరోపణలు చేశారు. రాజకీయాన్ని వైసీపీ వ్యాపారంలో తయారు చేసిందని మండిపడ్డారు.
ఈ ఐదేళ్లలో వైసీపీ రాష్ట్రాన్ని అన్ని విధాలా దివాళా తీయించిందని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఇసుక, మద్యం, గనులు, భూములు కొల్లగొట్టి దోచేశారని ఆరోపించారు. వైసీపీ నేతలకు అడ్డువచ్చిన వారిపై దౌర్జన్యాలు, దొంగ కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే ఎన్డీఏ కూటమి గెలవాలని ఆకాంక్షించారు. కాగా, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థిగా రాజంపేట లోక్ సభ స్థానం నుండి కిరణ్ కుమార్ రెడ్డిగా ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతోన్న విషయం తెలిసిందే.