- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
AP News:వైఎస్ భారతితో కలిసి పాస్‌పోర్ట్ కార్యాలయానికి మాజీ సీఎం జగన్..కారణం ఏంటంటే?
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చెందిన విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో అన్ని స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమాతో ఉన్న వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితం అయింది. దీంతో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఈ విషయం పై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పార్టీ నేతలతో ఇది వరకే చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఇటీవల వైఎస్ జగన్, భార్య వైఎస్ భారతితో కలిసి బెంగళూరు వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
మాజీ సీఎం జగన్ పాస్‌పోర్ట్ రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు నిన్న (గురువారం) సాయంత్రం 5.30 గంటల సమయంలో తన భార్య వైఎస్ భారతితో కలిసి విజయవాడ బందరు రోడ్డులోని పాస్‌పోర్టు ఆఫీస్‌కు వెళ్లినట్లు సమాచారం. ఈ క్రమంలో మాజీ సీఎం వెంట పలువురు వైసీపీ నాయకులు ఉన్నారు. మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ రఘురాం, మాజీ ఎంపీ సురేష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, దేవినేని అవినాష్, ఇతర నాయకులు ఉన్నారు. రెన్యువల్ ప్రక్రియ ముగిసిన అనంతరం 5.50 గంటల సమయంలో అక్కడి నుంచి నేరుగా తాడేపల్లి నివాసానికి వెళ్లిపోయారు.