AP:గన్నవరం చేరుకున్న వైఎస్ జగన్..ఆ నినాదాలతో హోరెత్తించిన పార్టీ శ్రేణులు

by Jakkula Mamatha |   ( Updated:2024-07-02 12:51:14.0  )
AP:గన్నవరం చేరుకున్న వైఎస్ జగన్..ఆ నినాదాలతో హోరెత్తించిన పార్టీ శ్రేణులు
X

దిశ,వెబ్‌డెస్క్: మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ బెంగళూరు పర్యటన ముగించుకుని ఈ రోజు (మంగళవారం) సాయంత్రం గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. గన్నవరంలో ఆయనకు వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలో పార్టీ శ్రేణులు వైఎస్ జగన్‌ను చూడడంతోనే ‘సీఎం..సీఎం’ అంటూ నినాదాలతో ఎయిర్‌పోర్టులో హోరెత్తించారు. వైఎస్ జగన్‌కు స్వాగతం పలికిన వారిలో మాజీ మంత్రులు పేర్ని నాని, మేరుగ నాగార్జున, వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు. ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, సింహాద్రి రమేష్ బాబు, దూలం నాగేశ్వరరావు, కైలే అనిల్, బెజవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి తదితరులు ఉన్నారు. అనంతరం అక్కడి నుంచి ఆయన నేరుగా తాడేపల్లిలోని తన నివాసానికి వెళ్లనున్నారు. కాగా వారం రోజుల క్రితం బెంగళూరు వెళ్లిన జగన్ తన ప్యాలెస్‌లో విశ్రాంతి తీసుకున్నారు. తిరిగి ఇప్పుడు రాష్ట్రానికి చేరుకున్నారు.

Advertisement

Next Story