Breaking:ఢిల్లీకి బయలుదేరిన మాజీ సీఎం జగన్

by Jakkula Mamatha |   ( Updated:2024-07-23 10:34:24.0  )
Breaking:ఢిల్లీకి బయలుదేరిన మాజీ సీఎం జగన్
X

దిశ,వెబ్‌డెస్క్: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ నేడు(మంగళవారం)ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయానికి వైఎస్ జగన్ చేరుకున్నారు. కాసేపట్లో గన్నవరం నుంచి ఎయిర్ ఇండియా విమానంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఢిల్లీ వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు వైఎస్ జగన్ అక్కడే ఉండనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో జరుగుతున్న దాడులకు నిరసనగా రేపు దేశ రాజధాని ఢిల్లీలో ధర్నా చేయనున్నారు. అలాగే, ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపిస్తూ పీఎం నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. అయితే ఓ వైపు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న క్రమంలో వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన పై టీడీపీ, జనసేన తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. చర్చలు నుంచి తప్పించుకునేందుకు ఈ పర్యటన అని విమర్శలు గుప్పిస్తున్నారు.

Advertisement

Next Story