జైల్లోకి మారువేషంలో వచ్చిన ఆఫీసర్.. చంద్రబాబును చూసి ఏం చేశారంటే..!

by srinivas |   ( Updated:2024-05-09 06:44:01.0  )
జైల్లోకి మారువేషంలో వచ్చిన ఆఫీసర్.. చంద్రబాబును చూసి ఏం చేశారంటే..!
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆయన జైల్లో ఉన్న సంచలన ఘటన జరిగింది. ఆ విషయాన్ని చంద్రబాబు స్వయంగా బయటకు చెప్పారు. ఓ టీవీ ఛానల్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘నేను జైల్లో ఉన్నప్పుడు తన వద్దకు మారువేషంలో ఓ ఆఫీసర్ వచ్చారు. వణికిపోతున్నారు. ఏంటి అని అడిగా. సార్ మాకు తెలియదు సార్ అని అన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. ధైర్యంగా ఉండు ఏమీ కాదని చెప్పా. నేను అన్యాయం చేస్తున్నా సార్ అని అన్నాడు. అన్యాయం చేస్తున్నానని అంటున్నారు.. ధైర్యంగా ఉండాలని చెబుతున్నారు. చంపేస్తారు సార్.. నాకు ఏది చెబితే అది చేయాలని అన్నాడు. అలా చేయకపోతే నన్ను చంపేస్తారు సార్ అని అన్నాడు.’ అని చంద్రబాబు తెలిపారు. చెప్పింది చేయాలని అధికారులను సైతం అరెస్ట్ చేస్తామని వైసీపీ నేతలు బెదిరించారని చంద్రబాబు పేర్కొన్నారు. తాను జైల్లో ఉన్నప్పుడు ఇంకా చాలా జరిగాయని చెప్పారు. నీచమైన కుట్రలు చేశారని తెలిపారు. డ్రోన్ ఎగురవేయడం లాంటి చేశారని పేర్కొన్నారు. తనను జైల్లో ఉంచి రాక్షస ఆనందం పొందడమే కాకుండా ఎలిమినేట్ చేయాలని చూశారని వ్యాఖ్యానించారు.ఏది జరిగితే అది జరుగుతుందని, ధైర్యంగా ఉన్నానని పేర్కొన్నారు.

Advertisement

Next Story