కొల్లేరు లంక గ్రామాలకు బిగ్ అలర్ట్.. వరద ప్రమాద హెచ్చరిక జారీ

by srinivas |
కొల్లేరు లంక గ్రామాలకు బిగ్ అలర్ట్.. వరద ప్రమాద హెచ్చరిక జారీ
X

దిశ, వెబ్ డెస్క్: కొల్లేరు లంక గ్రామాలకు అధికారులు బిగ్ అలర్ట్ ప్రకటించారు. విజయవాడ నగరాన్ని వణికించిన బుడమేరు ఇప్పుడు కొల్లేరు వాసులను వణికిస్తోంది. బుడమేరు వాగు ఉధృతితో కొల్లేరుకు భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉండొద్దని, ఎత్తు ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరించారు.

అయితే ఇప్పటికే కురిసిన భారీ వర్షంతో కొల్లేటి లంక గ్రామాలు విలవిలలాడిపోయాయి. కొల్లేరు పరివాహక ప్రాంత వీధులు జలమయమయ్యాయి. స్థానిక తమ్మిలేరు, రామిలేరు వాగుల నీరు ఇప్పటికే కొల్లేరుకు భారీగా చేరింది. దీంతో ఉధృతిగా కొల్లేరు ప్రవహిస్తోంది. ఈ ఉధృతితో కొన్ని గ్రామాలు ఇప్పటికే నీట మునిగాయి. పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. ఏలూరు- కైకలూరు రహదారిని అధికారులు మూసి వేశారు.

తాజాగా లంక గ్రామాలకు వరద ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముందస్తు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed