Ap News:‘అటవీ శాఖలో ఖాళీల భర్తీ’..డిప్యూటీ సీఎం పవన్ కీలక నిర్ణయం

by Jakkula Mamatha |
Ap News:‘అటవీ శాఖలో ఖాళీల భర్తీ’..డిప్యూటీ సీఎం పవన్ కీలక నిర్ణయం
X

దిశ,వెబ్‌డెస్క్:రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయింది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధిపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటవీ శాఖపై సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. అలాగే పలు శాఖలపై పవన్ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న (సోమవారం) అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని అటవీశాఖ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సంగతి తెలిసిందే. గ్లోబల్ టైగర్ డే సందర్భంగా గంటపాటు ఈ సమావేశం సాగింది. అటవీ శాఖ అధికారులతో రెండో సారి పవన్ సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రసంగించారు. ఈ క్రమంలో అటవీ శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. పులుల సంతతి మరింత పెరిగేందుకు వీలుగా నల్లమల నుంచి శేషాచలం వరకు ప్రత్యేక కారిడార్ ఏర్పాటు చేస్తామని పవన్ ప్రకటించారు.

Advertisement
Next Story

Most Viewed