- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Minister Lokesh:సీఎం చంద్రబాబు వల్లే ఐటీలో అద్భుత ఫలితాలు.. మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
దిశ,వెబ్‌డెస్క్: వికసిత్ భారత్, వికసిత్ ఏపీ నినాదంతో ముందుకెళ్తున్నామని మంత్రి లోకేష్(Minister Lokesh) తెలిపారు. అమరావతిలోని వీఐటీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఫెయిర్(International Higher Education Fair) ను మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ (IT Minister Nara Lokesh)నేడు (గురువారం) ప్రారంభించారు. ఈ క్రమంలో అమరావతి విట్ వర్సిటీలో అంతర్జాతీయ ఉన్నత విద్య పై సదస్సులో మంత్రి లోకేష్ మాట్లాడారు.
తాను కూడా హయ్యర్ స్టడీస్ కోసం విదేశాలకు వెళ్లానని గుర్తుచేసుకున్నారు. మనకు, విదేశాల్లో విద్యకు తేడాలు ఉన్నాయని చెప్పారు. ఐటీ రంగం అభివృద్ధికి సీఎం చంద్రబాబు కృషి చేశారన్నారు. సీఎం చంద్రబాబు చేసిన కృషి వల్లే ఐటీలో అద్భుత ఫలితాలు వచ్చాయని, మన విద్యార్థులు అద్భుతంగా రాణిస్తున్నారని పేర్కొన్నారు. విదేశాల్లో ఇప్పుడు మన తెలుగు వాళ్ళు మంచి స్థానాల్లో ఉన్నారు. గెలవడం కోసం నిలబడాలన్న మాటను విద్యార్థులు గుర్తుపెట్టుకోవాలని తెలిపారు. అంతర్జాతీయ పరిణామాల గురించి అవగాహనతో ఉండాలని, రాబోయే 25 ఏళ్లలో భారత్ మరింత అభివృద్ధి చెందనుందని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.