చిరంజీవిని విమర్శించేంత సంస్కార హీనుడ్ని కాదు: కొడాలి నాని

by GSrikanth |   ( Updated:2023-08-22 07:57:34.0  )
చిరంజీవిని విమర్శించేంత సంస్కార హీనుడ్ని కాదు: కొడాలి నాని
X

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేళ మాజీ మంత్రి, గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మెగాస్టార్ బర్త్ డే వేడుకల్లో కొడాలని నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాని మీడియాతో మాట్లాడుతూ.. చిరంజీవిని ఏనాడూ తాను విమర్శించలేదని.. ఒకవేళ విమర్శలు చేయాల్సి వస్తే రాజకీయంగా ఏం జరుగుతుందో నాకు తెలుసు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయపరంగా కామెంట్లు చేసేటప్పుడు తాను శ్రీరామ అంటే.. జనసేన, టీడీపీ నేతలకు అవి బూతుల్లా వినపడుతున్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు.

అంతేకాదు.. ఎప్పుడు ఎవరి జోలికి వెళ్లని, మంచి మనసున్న చిరంజీవిని విమర్శించేంత సంస్కార హీనుడిని తాను కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవిని తాను ఎన్నోసార్లు కలిశానని, జీవితంలో ఆయన చేసిన సూచనలు తప్పకుండా పాటిస్తానని అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో చిరంజీవి ఒక శిఖరం అని కొనియాడారు. ఆయన్ను విమర్శించే మనస్థత్వం తనది కాదని, మా ఇద్దరి మధ్య కొందరు అగాదం సృష్టించాలని చూస్తున్నారని అన్నారు. గతంలో సినిమా ఇండస్ట్రీలోని కొందరిపై తాను చేసిన కామెంట్లను చిరంజీవిని అన్నట్లుగా చిత్రీకరించారని అన్నారు.

Advertisement

Next Story