- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Ap Assembly Sessions: ఆ బిల్లు రద్దుకు స్కెచ్ రెడీ..!
దిశ, వెబ్ డెస్క్: ఏపీ అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధమవుతోంది. సోమవారం నుంచి సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం చేసింది. సమావేశాలకు అన్ని పార్టీ ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. సోమవారం ఉదయం 8 గంటలకు వెంకటపాలెం వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లనున్నారు. పసుపు రంగు దుస్తులు, సైకిల్ గుర్తుతో ఉన్న కండువాలతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లాలని ఇప్పటికే నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేసుకున్నారు.
ఇక సోమవారం ఉదయం 10 గంటలు ప్రారంభం కానున్నాయి. సమావేశాలు ప్రారంభం అయిన వెంటనే అసెంబ్లీలో ఉమ్మడి సభలను ఉద్దేశించి గవర్నర్ నజీర్ ప్రసంగించనున్నారు. అనంతరం బీఏసీ సమావేశానికి సభ్యులను స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆహ్వానించానున్నారు. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఐదు రోజులు పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. మరో మూడు నెలలకు సంబంధించి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను అసెంబ్లీలో పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్‌లో మరోసారి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి అప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం.
అయితే ప్రస్తుత సమావేశాల్లో గత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ బిల్లును రద్దు చేయాలని ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఈ నెల 23న ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దుకు సంబంధించిన బిల్లును అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు చెబుతున్నారు. ఈ బిల్లు రద్దుకు మెజార్టీ ఎమ్మల్యేలు మద్దతు తెలిపే అవకాశం ఉంది. అనంతరం ఆర్థిక పరిస్థితి, శాంతి భద్రతలు, మద్యం అంశాలపై శ్వేత పత్రాలను సీఎం చంద్రబాబు విడుదల చేయనున్నారు.
Read More..
Nagababu: ప్రభుత్వ పదవిపై మనసులో మాట బయటపెట్టిన నాగబాబు.. ఏమన్నారంటే..?