క్వాష్ పిటిషన్ కొట్టేసినా.. చంద్రబాబును నిర్దోషిగా తీసుకువస్తాం : ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు

by Seetharam |   ( Updated:2023-09-22 12:29:04.0  )
క్వాష్ పిటిషన్ కొట్టేసినా.. చంద్రబాబును నిర్దోషిగా తీసుకువస్తాం : ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు
X

దిశ, డైనమిక్ బ్యూరో : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై అక్రమ కేసు పెట్టి దోషిగా చిత్రీకరించడానికి వైసీపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆరోపించారు.మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. టీడీపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చించకుండా, తమకు మాట్లాడే అవకాశమివ్వకుండా వందలమంది మార్షల్స్ సాయంతో సభను నడపాలని ప్రయత్నించారు అని మండిపడ్డారు. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు మాపై తిట్లదండకం మొదలుపెట్టి, దౌర్జన్యకాండకు దిగారు అని ఆరోపించారు.

ఒక కల్పిత కేసుతో చంద్రబాబుపై బురదజల్లడానికి ఈ ప్రభుత్వం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తోంది అని మండిపడ్డారు. ఎటువంటి ఆధారాలు.. సాక్ష్యాలు లేని కేసులో తమ అధినేత తరుపున హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్ కొట్టివేయడం జరిగింది. అయినప్పటికీ న్యాయవ్యవస్థపై తమకు ఉన్న అచంచల విశ్వాసం చెక్కుచెదరదు. ఉన్నత న్యాయస్థానంలో వాదనలు వినిపించి, చంద్రబాబుని నిర్దోషిగా ప్రజలముందు ఉంచుతాం అని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు చెప్పుకొచ్చారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చాలామందికి ఇప్పటికే యాంటిసిపేటరీ బెయిల్స్ వచ్చాయి. అనేకమంది రిమాండ్ రిజక్ట్ అయ్యింది. అలాంటి కేసులో చంద్రబాబుని 37వ ముద్దాయిగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం.. ఆయన్ని మానసికంగా వేధించడం, అసత్యాలు ప్రచారం చేయడం చేస్తున్నారు అని మండిపడ్డారు. జగన్ రెడ్డి 38కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు. అవినీతి కేసుల విచారణకు హాజరు కాకుండా బయట తిరుగుతున్నాడు. వైసీపీప్రభుత్వ, జగన్ రెడ్డి కుట్రలు, కుతంత్రాలు ప్రజలకు తెలియచేసి, ప్రజాక్షేత్రంలో ఈ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెడతాం అని టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబ శివరావు హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed