Pawan Kalyan:డిప్యూటీ సీఎం పవన్‌కు తీవ్ర జ్వరం.. అయినా వెనక్కి తగ్గేది లేదంటూ!

by Jakkula Mamatha |
Pawan Kalyan:డిప్యూటీ సీఎం పవన్‌కు తీవ్ర జ్వరం.. అయినా వెనక్కి తగ్గేది లేదంటూ!
X

దిశ,వెబ్‌డెస్క్: ఇటీవల తిరుమల తిరుపతి దేవాలయంలో మహాప్రసాదంగా భావించే స్వామివారి లడ్డూ(Tirumala Laddu) ప్రసాదం కల్తీ అయిందన్న వార్తలు ఏ స్థాయిలో సంచలనం సృష్టించాయో తెలిసిందే. ఈ క్రమంలో తప్పైపోయింది అని.. తమను క్షమించాలని స్వామివారిని కోరుతూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సెప్టెంబర్ 22న ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లా నంబూరు లోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేపట్టిన పవన్.. నిన్న(బుధవారం) 11 రోజుల తర్వాత నడక మార్గం ద్వారా తిరుమల చేరుకొని తిరుమలలో(Tirumala) దీక్షను విరమించారు.

ఇదిలా ఉంటే నిన్నటి(బుధవారం) నుంచి జనసేనాని తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. ఫీవర్ కారణంగా వైద్యులు పవన్ వద్దకు చేరుకుని చికిత్స అందించారు. అయితే ఈ రోజు(గురువారం) సాయంత్రం తిరుపతిలో వారాహి సభ జరుగనుంది. జ్వరం తోనే ఈ సాయంత్రం జరిగే వారాహి సభలో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. అయితే నిన్నటి నుంచి గెస్ట్ హౌస్‌కే పరిమితమైన డిప్యూటీ సీఎం ఈరోజు అందుబాటులో ఉన్న నాయకులతో భేటీ అయ్యారు. ఈరోజు జరుగనున్న వారాహి సభలో ఏం మాట్లాడాలన్న అంశంపై నేతలతో పవన్ కళ్యాణ్ చర్చించారు. ఈ సాయంత్రం 5 గంటలకు తిరుమల నుంచి తిరుపతికి బయలుదేరనున్న డిప్యూటీ సీఎం పవన్(Deputy CM Pawan).. 6 గంటలకు జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద జరగనున్న వారాహి సభలో పాల్గొంటారు.

Next Story

Most Viewed