Ap Results: సిక్కోల చిన్నోడికి లక్ష ఓట్లు దాటేశాయిగా..?

by srinivas |   ( Updated:2024-06-04 06:54:53.0  )
Ap Results: సిక్కోల చిన్నోడికి లక్ష ఓట్లు దాటేశాయిగా..?
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ఎన్నికల కౌంటింగ్‌లో టీడీపీ అభ్యర్థుల జోరు కొనసాగుతోంది. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో తెలుగుదేశం వైపే ప్రజలు మొగ్గుచూపారు. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమలోనూ సైకిల్ స్పీడుకు ఫ్యాన్ కొట్టుకుయింది. మరీ ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో తెలుగు దేశం పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీ దిశగా కొనసాగుతున్నారు. సిక్కోలు చిన్నోడు, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు హవాకు ఢోకాలేదు. మరోసారి కూడా ఆయనదే పై చేయి. అన్ని రౌండ్లలోనూ రామ్మోహన్ నాయుడు ఆధిక్యం సాధించారు. ఇప్పటికే రెండు సార్లు ఎంపీగా గెలిచిన ఆయన మూడో సారి కూడా విజయం దిశగా దూసుకుపోతున్నారు. ఇప్పటివరకూ జరిగిన ఎన్నికల పోలింగ్‌లో రామ్మోహన్ నాయుడు లక్ష ఓట్లకు పైగా సాధించి ఆధిక్యం కొనసాగిస్తున్నారు.

Advertisement

Next Story