- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్నికల ముందు జనసేనకు భారీ షాక్ ఇచ్చిన ఈసీ
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ఎన్నికలు మే 13న ఒకే విడతలో జరగనున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ని ఓడించి అధికారంలోకి వచ్చేందుకు.. టీడీపీ, బీజేపీలతో జనసేన పొత్తు పెట్టుకుంది. పొత్తులో భాగంగా జనసేనకు వచ్చిన సీట్లలో అభ్యర్థులను ప్రకటించిన పవన్ కల్యాణ్ స్వయంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ సమయంలో జనసేన పార్టీకి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఎన్నికల నేపథ్యంలో గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలు, గుర్తింపు లేని పార్టీల జాబితాను ఈ రోజు ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ జాబితాలో ఏపీ నుంచి గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీల్లో టీడీపీ, వైసీపీకి చోటు దక్కింది.
కానీ జనసేన పార్టీకి మాత్రం రిజిస్టర్ పార్టీల జాబితాలో ఎన్నికల సంఘం చోటు కల్పించింది. దీంతో ఫ్రీ సింబల్స్ జాబితాలో గ్లాస్ గుర్తు(జనసేన గుర్తు) ఉంది. దీంతో అప్రమత్తమైన జనసేన పార్టీ న్యాయనిపుణులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. జనసేన పార్టీ సింబల్ గ్లాస్ గుర్తు ఒకవేళ ఫ్రీ సింబల్ లో ఉంటే.. ఇండిపెండెంట్ గా పోటీ చేసే వారికి కూడా.. ఎంపిక ద్వారా గ్లాసు గుర్తు కేటాయించే అవకాశం ఉంది. ఇలా జరిగితే ఎన్నికల్లో జనసేన పార్టీకి భారీ నష్టం జరుగుతుంది.
Read More..
వైసీపీని ఎలా తొక్కుకుంటూ వెళ్లాలో చెప్పిన నారా లోకేష్ .. ట్వీట్ వైరల్..