- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Ap News: పెళ్లి వేడుకలో పగిలిన తలలు
దిశ, డైనమిక్ బ్యూరో: పెళ్లి అనేది జీవితంలో ఒకసారి జరిగే ఓ వేడుక. ఈ వేడుకలో జరిగే ప్రతీతంతును వధూ వరుల కుటుంబ సభ్యులు ఎంతో ఉత్సాహంగా..సందడిగా నిర్వహిస్తారు. అంతేకాదు ప్రతీ వేడుకను జీవితాంతం గుర్తంచుకునేలా భద్రపరచుకుంటారు. ఇక పెళ్లి వేడుకల్లో డ్యాన్స్ చేయడం కూడా తరచూ జరుగుతూనే ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో పెళ్లి అయిన తర్వాత వధూవరులిద్దరూ తమ కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో కలిసి స్టెప్పులు వేయం ప్రస్తుతం ట్రెండింగ్‌గా మారింది.
అయితే ఇదే అంశం తల పగిలేలా చేసింది. వివాహవేడుక అనంతరం వధూవరులు ఇద్దరూ డ్యాన్స్ చేయాలని పట్టుబట్టారు. అయితే వధువు తరపువారు అందుకు అభ్యంతరం వ్యక్తం చేయడంతో గొడవ జరిగింది. అది కాస్తా కొట్లాటకు దారి తీసింది. ఈ ఘటన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. రామచంద్రపురానికి చెందిన సుబ్రహ్మణ్యంతో తాళ్లపూడి మండలం గజ్జరం గ్రామానికి చెందిన పూజితకు పెళ్లి కుదిరింది. సోమవారం రామచంద్రాపురంలో వివాహం ఘనంగా జరిగింది.
అయితే విందు సమయంలో వధూవరులిద్దరినీ డ్యాన్స్ చేయాలని పట్టుబట్టారు. ఇందుకు వధువు తరపు వారు అభ్యంతరం చెప్పడం గొడవకు దారి తీసింది. దీంతో ఒకరినొకరు కొట్టుకున్నారు. ఈ ఘటనలో ఒక మహిళ తలపగలగా మరోకరు చేయి విరిగింది. మరో ముగ్గురు సైతం గాయపడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు పెళ్లి మండపానికి చేరుకుని క్షతగాత్రులను రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.