- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యనమల..వాస్తవాలు తెలుసుకుని మాట్లాడు: Minister Daissetty Raja
దిశ, తుని: యనమల రామకృష్ణుడు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నాడని రోడ్లు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీ విద్యా విధానాలను కేంద్ర బడ్జెట్‌లోనూ ఆయన ప్రస్తావించారు. చాలా విషయాల్లో రాష్ట్రానికి గుర్తింపు లభించిందని దాడిశెట్టి రాజా పేర్కొన్నారు. 'నాడు-నేడుతో పాఠశాలల రూపురేఖలు మార్చాం. విద్య, వైద్య రంగాలకు అత్యధికంగా ఖర్చు చేస్తున్నాం' అని మంత్రి రాజా అన్నారు. 'గత ప్రభుత్వ హయాంలో స్కూళ్లలో టాయిలెట్లు కూడా సరిగాలేవు. నాడు-నేడు కింద రూపురేఖలు మార్చిన స్కూళ్ళు గురించి తెలుసుకోవాలన్నారు. యనమల స్వగ్రామంలోనూ నాడు-నేడు పనులు జరుగుతున్నాయి. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే మంచిది'. అని దాడిశెట్టి రాజా హితవు పలికారు. 'యనమల వస్తే నియోజకవర్గంలో స్కూళ్లకు తీసుకెళ్తాను. ఆయన అసందర్భ ప్రేలాపనలు పేలుతున్నారు. హైస్కూల్ వస్తే మన పొలాల్లో పని చేసేందుకు ఎవరూ ఉండరన్నావు. యనమల విద్యా వ్యవస్థ గురించి మాట్లాడటం విడ్డురంగా ఉంది.' అని మంత్రి రాజా అన్నారు.