- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోలీసులకే న్యాయం జరగడం లేదు.. Chintakayala Ayyanna Patrudu ఆగ్రహం
దిశ, ఉత్తరాంధ్ర: రాష్ట్రంలో న్యాయం చేయవలసిన పోలీసులకే న్యాయం జరగడంలేదని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు విమర్శించారు. పోలీసులు దాచుకున్న 800 కోట్ల రూపాయల ప్రావిడెంట్ ఫండ్‌ను సీఎం జగన్ వాడేశారని ఆయన ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు.
సీఎం జగన్ స్వార్థం కోసం అధికారులతోటే తప్పుడు పనులు చేయిస్తున్నారని అయ్యన్న ఆరోపించారు. పోలీస్ డిపార్ట్మెంట్‌లో కొంతమంది అధికారుల వల్ల డిపార్ట్మెంట్ అంతటికీ చెడ్డ పేరు వచ్చిందన్నారు. ప్రజాస్వామ్యంలో తప్పులు చేస్తే విమర్శించడం తమ ధర్మమని, విమర్శించినందుకు తప్పుడు కేసులు బనాయించి ఇంటిపై దాడులు చేసి ఆస్తులు ధ్వంసం చేయడం ఎంతవరకు సబబని అయ్యన్న ప్రశ్నించారు. అర్ధరాత్రి సమయంలో వచ్చి అరెస్టులు చేయడంతో పాటు తనపై 15 తప్పుడు కేసులు బనాయించారని గుర్తు చేశారు. రాష్ట్ర జనాభాకి సుమారు 75 వేల మంది పోలీసులు అవసరం ఉండగా కేవలం 60 వేల మంది మాత్రమే సేవలందిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో లా అండర్ ఆర్డర్ కాపాడటానికి వారు సరిపోతారా? అని అయ్యన్న ప్రశ్నించారు.