236 తాబేళ్ల అక్రమ రవాణా.. అడ్డుకున్న అధికారులు

by srinivas |
236 తాబేళ్ల అక్రమ రవాణా.. అడ్డుకున్న అధికారులు
X

దిశ,కాకినాడ: కాకినాడ నుంచి ఒరిస్సాకు కారులో అక్రమంగా తాబేళ్లను తరలిస్తుండగా అటవీశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. చింతూరు ఏజెన్సీలో తాబేళ్లు అక్రమ రవాణాను చింతూరు అటవీ శాఖ అధికారులు దాడి చేసి భారీగా తాబేళ్లు పట్టుకున్నారు. తులసిపాక అటవీ శాఖ చెక్ పోస్టు అధికారుల అధ్వర్యంలో జరిగిన దాడిలో కారులో 246తాబేళ్లు లభ్యమవగా 230 తాబేళ్లు సజీవంగా ఉన్నాయి.మరో 16తాబేళ్లు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. కారులో తాబేళ్లను అక్రమంగా తరలిస్తున్న ఒడిస్సాకు చెందిన సూరజ్ మండల్‌ను ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.



Next Story