- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Ap News: పవన్ కల్యాణ్ దృష్టికి ప్రాబ్లమ్.. దెబ్బకు సాల్వ్
దిశ, వెబ్ డెస్క్: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) చొరవతో కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మహిళా జూనియర్ కళాశాల(Gollaprolu Womens Junior College)కు కంప్యూటర్ల కళ వచ్చింది. కళాశాలలో విద్యార్థినులకు కంప్యూటర్ సైన్స్ శిక్షణ(Computer Science Training) అందించేవారు. ఇందుకు కంప్యూటర్లను వినియోగించారు. కానీ కొన్నేళ్లుగా శిక్షణ అందించేందుకు కంప్యూటర్లు అందుబాటులో లేవు. అయితే ఈ విషయం పిఠాపురం నియోజకవర్గం(Pithapuram Constituency) వ్యాప్తంగా సమస్యల అధ్యయనం కోసం వెళ్ళిన ఉప ముఖ్యమంత్రి కార్యాలయం, పేషి అధికారుల బృందం గుర్తించింది.
అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన.. కళాశాలకు అవసరమైన కంప్యూటర్లు అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు 1.1 లక్ష రూపాయల CSR నిధుల సహకారంతో 2 కంప్యూటర్లను అందజేశారు. విద్యార్ధులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చదువుకునే పరిస్థితులు ఉండేలా చూడాలని అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. దీంతో విద్యార్థినులు, కాలేజీ సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
పిఠాపురం నియోజకవర్గం, గొల్లప్రోలు మహిళా జూనియర్ కళాశాల విధ్యార్ధినులకు గత కొన్నేళ్లుగా కంప్యూటర్ సైన్స్ శిక్షణ అందించేందుకు కంప్యూటర్లు అందుబాటులో లేవనే విషయాన్ని ఇటీవలే పిఠాపురం నియోజకవర్గం వ్యాప్తంగా సమస్యల అధ్యయనం కోసం వెళ్ళిన ఉప ముఖ్యమంత్రి కార్యాలయం, పేషి అధికారుల బృందం… pic.twitter.com/NGOyhAs5RF
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) October 17, 2024