- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
యాంకర్ సుమ మెడకు చుట్టుకుంటున్న రియల్ ఎస్టేట్ వివాదం
దిశ, రాజమహేంద్రవరం: రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న రాకీ అవెన్యూస్ సంస్థ బోర్డు తిప్పేయడంతో టాలీవుడ్ ప్రముఖ యాంకర్ సుమ కనకాల వివాదంలో చిక్కుకున్నారు. ఆమె ప్రచారం చేసిన సంస్థ దివాలా తీయటంతో బాధితులు రోడ్డెక్కారు. తమకు న్యాయం చేయాలంటూ ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. రాజమండ్రిలో రాకీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మధ్య తరగతి కుటుంబాలకు రూ.26 లక్షలకే సొంత ఇల్లు ఇప్పిస్తామని ఆఫర్ పెట్టింది. ఆ సంస్థకు యాంకర్ సుమ కనకాల ప్రచారం చేశారు. ఆమె మాటలతో ఆ సంస్థను నమ్మిన ప్రజలు లక్షల్లో డబ్బులు చెల్లించి ప్లాట్లు బుక్ చేసుకున్నారు. అలా అందరి నుండి దాదాపు రూ.88 కోట్లు వసూలు చేసిన తరువాత ఇప్పుడు రాకీ అవెన్యూస్ సంస్థ బోర్డు తిప్పేయడంతో మోసపోయామని తెలుసుకున్న బాధితులు రోడ్ ఎక్కారు. తమకు న్యాయం చేయాలంటూ పోలీసులతో పాటు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కేవలం సుమ కనకాల ఆ సంస్థకు ప్రచారం చేయడం వల్లే ప్లాట్స్ కొన్నామని, ఇప్పుడు వాళ్లు బోర్డు తిప్పేశారని కొందరు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి సుమ కూడా తమకు న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు.