- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
చికెన్ తినొద్దంటూ ప్రచారం.. ఎక్కడంటే?

దిశ, డైనమిక్‌బ్యూరో: గ్రామ పంచాయతీ వారి హెచ్చరిక.. పెరవలి మండలం కానూరు గ్రామంలో కోళ్లకు వైరస్సోకింది. కాబట్టి చికెన్ అమ్మడం, కొనడం చేయరాదంటూ.. హెచ్చరిస్తూ పంచాయతీ అధికారులు ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంతో ప్రజలు అప్రమత్తం అయ్యారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కోళ్ల మరణాలకు కారణం తేలింది. ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా (హెచ్5ఎన్1 -బర్డ్ ఫ్లూ) కారణమని పశు వైద్యులు గుర్తించారు. ఈ కారణంగా ఇక్కడ కుప్పలు తెప్పలుగా కోళ్లు చనిపోతున్నాయి. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. కోళ్లు ఎక్కువగా చనిపోతున్న చోట ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. పలు గ్రామాల్లో 144 సెక్షన్ విధించారు. 133 సెక్షన్ కూడా విధించిన సర్వేలెన్స్ జోన్లోకి తీసుకువస్తున్నామని అన్నారు. చనిపోయిన కోళ్లను వెంటనే దహనం చేయాలని చెబుతున్నారు. బర్డ్‌ఫ్లూ మనుషులకు కూడా వ్యాపిస్తుందని, ఇక్కడి కోడి మాంసం తినకుండా ఉండడం బెటరని వైద్యులు, అధికారులు సూచిస్తున్నారు. ఉడికించిన మాంసం తీసుకోవచ్చన్నారు. గత ఐదు రోజులుగా ఏఏ ఫౌల్డ్రీ నుంచి కోళ్ల తరలి వెళ్లాయి అనే విషయాన్ని కూడా ఆరా తీస్తున్నారు. అయితే కోడి మాంసం తినవచ్చా లేదా అని ప్రజలు ఆరా తీస్తున్నారు. ఎక్కువ ఉష్ణోగ్రతలో ఈ వైరస్ బతకలేదు.. కోడి మాంసం, గుడ్లను బాగా ఉడకబెట్టి తింటే ఎలాంటి ప్రమాదం ఉండదని వైద్యులు అంటున్నారు. కానీ బర్డ్‌ఫ్లూ సోకిన ప్రాంతాల్లో చికెన్ తినవద్దంటూ పంచాయతీ వారు ప్రచారం నిర్వహిస్తున్నారు.