దివ్వెల మాధురి కారుకు ప్రమాదం.. ‘ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’ అంటూ సంచలన ప్రకటన

by Gantepaka Srikanth |   ( Updated:2024-08-11 10:23:51.0  )
దివ్వెల మాధురి కారుకు ప్రమాదం.. ‘ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’ అంటూ సంచలన ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారిన దివ్వెల మాధురి కారుకు ప్రమాదం జరిగింది. అతివేగంగా దూసుకొచ్చి ఆగివున్న కారును ఢీ కొట్టింది. ఈ సమయంలో కారులోనే ఉన్న ఆమె తలకు బలమైన గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు ఆమెను పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పలాస మండలం లక్ష్మీపురం టోల్‌గేట్ దగ్గర ఆదివారం మధ్యాహ్నం టెక్కలి నుంచి పలాస వైపునకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో మాధురినే సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తున్నట్లు సమాచారం. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ఉండగా.. ప్రమాదంపై మాధురి స్పందించారు. ఇది అనుకోకుండా జరిగిన ప్రమాదం కాదని.. కావాలనే నేను ఆగివున్న కారును ఢీకొట్టానని అన్నారు. వాణి చేస్తున్న ఆరోపణలు భరించలేకే ఇలా చేశానని అన్నారు. నాకు బతకాలని లేదు. ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తుందని అన్నారు. వైద్యులు కూడా తనకు చికిత్స అందించవద్దని కోరారు.

Advertisement

Next Story