- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాకినాడ టీడీపీ అభ్యర్థిపై డైలమాలో అధిష్టానం?
సార్వత్రిక ఎన్నికలు మరో ఏడాది ఉండగానే.. ఎమ్మెల్సీ ఫలితాలు టీడీపీలో జోష్ నింపాయి. ఇదే ఊపు అన్ని ప్రాంతాల్లోనూ కొనసాగించాలని తెలుగుదేశం అధిష్టానం భావిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ బలాలు, బలహీనతలపై అధ్యయనం చేస్తోంది. ఈ నేపథ్యంలో గోదావరి జిల్లాలకే ప్రధాన కేంద్రమైన కాకినాడ మీద అందరి చూపు కేంద్రీకృతమైంది. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే పటిష్టస్థితిలో ఉండగా.. తెలుగుదేశం ఇన్చార్జి వ్యవహారమే ఆ పార్టీ అధిష్టానాన్ని డైలమాలో పడేంది. మరి అలాంటి కాకినాడ నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితేమిటో ఒక్కసారి చూద్దాం.
దిశ, ఉభయ గోదావరి ప్రతినిధి: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒకప్పటి జిల్లా కేంద్రం కాకినాడ. ఇక్కడ ప్రస్తుత శాసనసభ్యునిగా వైసీపీకి చెందిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. ఒకరకంగా చెప్పాలంటే జిల్లా రాజకీయాల్లో ఆయన చక్రం తిప్పుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో ఉన్న అనుబంధంతో సిటీతోపాటు జిల్లా రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. వైసీపీపరంగా ద్వారంపూడి పరుగులు పెడుతుంటుంటే.. టీడీపీ మాత్రం ఆ వేగాన్ని అందుకోలేకపోతోంది. ఇక్కడ టీడీపీ ఇన్చార్జిగా ఉన్న కొండబాబు అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చి స్థానిక సమస్యలపై హడావుడి చేసి .. అనంతరం కనిపించకుండా పోతున్నారు. లేదంటే ద్వారంపూడిపై విరుచుకుపడుతూ అధిష్టానం దృష్టిలో పడే ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో ద్వారంపూడి స్ట్రాంగ్ గా కౌంటర్ ఇస్తే మళ్లీ కొంత గ్యాప్ తీసుకుంటున్నారు. దీంతో కాకినాడలో కొండబాబు వల్ల పార్టీకి లాభం లేదనే ప్రచారం టీడీపీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ సారి సీటు మార్చాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది.
కొండ బాబు వెనుకంజ
సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉండి , అనేక పర్యాయాలు శాసన సభ్యునిగా మంచి పేరు తెచ్చుకొన్న కొండబాబు 2014లో ఎమ్మెల్యేగా గెలుపొందాక ప్రజల్లో వ్యతిరేకత మూట కట్టుకున్నారు. ఇక్కడ అన్నగార్కే పగ్గాలు ఇవ్వడం పట్ల పార్టీ కేడర్ అసహనం వ్యక్తం చేసింది. దీనికి తోడు మేయర్ ఎన్నికల్లో పార్టీ అధికారంలో ఉన్నా, అతని అంతరంగీకులు సైతం కార్పొరేటర్లుగా గెలవలేని పరిస్థితి నెలకొంది. తర్వాత 2019 ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత ప్రతిపక్ష పాత్ర సరిగా పోషించలేదనే విమర్శ కొండబాబు మీద ఉంది. అధికార పార్టీపై పోరాటాలు చేసిన దాఖలాలు లేవు. దీనికి తోడు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవిశ్వాస తీర్మానం పెట్టి మేయర్ ను ఓడించి పార్టీకి అనుకూలమైన మేయర్ కు పగ్గాలు ఇప్పించడంలో ద్వారంపూడి విజయవంతమయ్యారు. దీంతో కొండబాబు మీద పార్టీ అధిష్టానం గుర్రుగా ఉన్నట్లు తెలిసింది.
ప్రయత్నాలు ఫలించేనా..
కాకినాడ సిటీకి సంబంధించి టీడీపీ సీటు కోసం కులాల వారీగా అనేక మందిప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో కాపులకు ఇస్తే తామూ రేసు ఉన్నామని మాజీ మేయర్ సుంకర పావని అంటున్నారు. అయితే ప్రస్తుత మత్స్య కారుల కోటాకు చెందిన కొండబాబును కాదని పావని కి ఎంత వరకూ టికెట్ ఇస్తారనేది చూడాలి. మత్స్య కారుల కోటాలోనే మరో వ్యక్తిని రంగంలోకి దింపే ఆలోచనలో పార్టీ ఉన్నట్లు సమాచారం. మరో వైపు కటకం శెట్టి బాబీ పేరు కూడా వినపడుతోంది. ఈయన స్వతహాగా మత్స్యకారుడు కాకపోయినా పార్టీ పెద్దలతో సత్సంబందాలు ఉన్నందున సీటు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే స్థానిక కేడర్ లో బాబీకి సరైన పట్టు లేదనే వాదన ఉంది. భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే.
ఇవి కూడా చదవండి: బిగ్ బ్రేకింగ్: ఏపీ కేబినెట్‌లో మరో ముగ్గురికి ఛాన్స్!