చంద్రబాబు లేఖపై డీజీపీ సీరియస్... విచారణకు ఆదేశం

by Seetharam |
చంద్రబాబు లేఖపై డీజీపీ సీరియస్... విచారణకు ఆదేశం
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి చంద్రబాబు నాయుడు పేరుతో బహిరంగ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ లేఖను చంద్రబాబు నాయుడు రాశారు అని టీడీపీ చెప్తుంటే ఆ లేఖ రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి వచ్చింది కాదు అని జైలు సూపరింటెండెంట్ రాహుల్ తెలిపారు. దీంతో లేఖపై గందరగోళం నెలకొంది. ఈ వ్యవహారంపై డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి సీరియస్ అయ్యారు.చంద్రబాబు లేఖ వ్యవహారం పై సమగ్ర విచారణకు ఆదేశించింది. నిజనిజాలు తేలిన తర్వాతే చర్యలు తీసుకుంటామని డీజపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఇప్పటికే జైలు డీజీ వివరణ ఇచ్చారు అని డీజీపీ తెలిపారు. జైలు నుండి చంద్రబాబు ఈ లేఖ విడుదల చేయలేదు అని తెలిపారు. ఎవరి ద్వారా బయటకు వచ్చిందో గుర్తిస్తామని.. కఠినమైన చర్యలు తీసుకుంటాం అని డీజీపీ హెచ్చరించారు. రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్లో చంద్రబాబు భద్రతకు ఎలాంటి ఢోకా లేదు అని స్పష్టం చేశారు. మూడు అంచెల భద్రత నడుమ చంద్రబాబు నాయుడు ఉన్నారని అన్నారు. ఇకపోతే చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టబోయే నిజం గెలవాలి యాత్రకు టీడీపీ నేతలు అనుమతి కోరలేదని అన్నారు. అనుమతి కోరితే అనుమతులపై చర్చిస్తానని చెప్పుకొచ్చారు. టీడీపీ ఆందోళన కార్యక్రమాలను పోలీసులు అడ్డుకోవడం లేదు అని డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed