DGP: పవన్ కళ్యాణ్ క్యాంపు ఆఫీస్‌పై ఎగిరిన డ్రోన్.. డీజీపీ కీలక ప్రకటన

by Shiva |   ( Updated:2025-01-20 06:38:27.0  )
DGP: పవన్ కళ్యాణ్ క్యాంపు ఆఫీస్‌పై ఎగిరిన డ్రోన్.. డీజీపీ కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం (Deputy CM) పవన్ కళ్యాణ్(Pawan Kalyan) క్యాంపు కార్యాలయంపై అనుమానిత (Suspect) డ్రోన్ ఎగరడం (drone flying) రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఆదివారం మధ్యాహ్నం సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మంగళగిరిలోని పవన్ కల్యాణ్ క్యాంపు ఆఫీస్ (Pawan Kalyan Camp Office)‌పై డ్రోన్‌ను ఎగురవేశారు. దీంతో అప్రమత్తమైన జనసేన నేతలు (Janasena leaders) డీజీపీ (DGP) పాటు, గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ (SP Sathish Kumar), కలెక్టర్‌ నాగలక్ష్మి (Naga Lakshmi)కి ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pavan Kalyan) భద్రతపై డీజీపీ ద్వారకా తిరుమల రావు (DGP Dwarka Tirumala Rao) ఇవాళ కీలక ప్రకటన చేశారు. పవన్ కళ్యాణ్ ఇంటి మీద డ్రోన్ ఎగిరిందా లేదా క్లారిటీ లేదని అన్నారు. మరో 24 గంటల్లో పూర్తి వివరాలను మీడియాకు వివరిస్తామని తెలిపారు. డిప్యూటీ సీఎం భద్రతపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నామని అన్నారు. నారా లోకేశ్‌ (Nara Lokesh)ని డిప్యూటీ సీఎం చేయాలని సోషల్ మీడియా (Social Media)లో జరుగుతోందని మీకు తెలుసా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఆ ప్రచారం తన దృష్టికి రాలేదని డీజీపీ క్లారిటీ ఇచ్చారు.

Next Story

Most Viewed