Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. నేడు స్థానికులకు టోకెన్లు

by Rani Yarlagadda |
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. నేడు స్థానికులకు టోకెన్లు
X

దిశ, వెబ్ డెస్క్: ఓ వైపు వర్షాలు, మరోవైపు చలితీవ్రత పెరగడంతో తిరుమల (Tirumala)లో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతుందని టీటీడీ (TTD) అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 67,496 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా.. 19,064 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. నిన్న (ఆదివారం) స్వామివారి హుండీ ఆదాయం రూ.3.33 కోట్లు వచ్చినట్లు వెల్లడించారు.

నిన్న తిరుమలలో భారీ వర్షాలకు (Heavy Rains) కొండచరియలు విరిగి పడటంతో.. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు శ్రీవారి మెట్టు (Srivari Mettu) మార్గం మూసివేశారు. కొండపై ఉన్న భక్తులు వర్షాల కారణంగా ఇబ్బందులు పడ్డారు.

నేడు స్థానికులకు టోకెన్లు

ఇక నేడు తిరుపతి వాసులకు శ్రీవారి దర్శనం కల్పించాలని ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రతి మంగళవారం స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పిస్తారు. ఇందులో భాగంగా.. నేడు (డిసెంబర్ 2) స్థానికులకు టోకెన్లు ఇవ్వనున్నారు. మహతి ఆడిటోరియంలో 2500 టోకెన్లు, తిరుమలలోని బాలాజీ నగర్ లోని కమ్యూనిటీ హాల్ లో 500 టోకెన్లు జారీ చేయనున్నారు. ఇందుకోసం భక్తులు తమ ఒరిజినల్ ఆధార్ కార్డును తీసుకు వెళ్లాల్సి ఉంటుంది. ఒకసారి దర్శనం చేసుకున్న స్థానికులకు మళ్లీ 90 రోజుల తర్వాతే దర్శనభాగ్యం కలుగుతుంది.

Advertisement

Next Story

Most Viewed