- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు: సరస్వతీ దేవి అలంకారంలో దుర్గమ్మ
దిశ, డైనమిక్ బ్యూరో : దసరా శరన్నవరాత్రి వేడుకల్లో సందర్భంగా ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. అమ్మవారి జన్మనక్షత్రమైన మూలానక్షత్రం రోజు కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు దుర్గగుడికి భక్తులు తరలి వచ్చారు. గురువారం అర్ధరాత్రి నుంచి ఇంద్రకీలాద్రి పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శించే అమ్మవారి కృపాకటాక్షాల కోసం వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకున్న దుర్గగుడి యాజమాన్యం.. పోలీస్ సిబ్బంది వేకువ జామున 1.30 నుంచి దర్శనాలు ప్రారంభించారు. ఇకపోతే దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మ 5వ రోజున నిజ ఆశ్వయుజ శుద్ధ సప్తమి శుక్రవారంనాడు సరస్వతీ దేవిగా దర్శనమిస్తున్నారు. అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రానికి శరన్నవరాత్రుల్లో ఎంతో విశిష్టత ఉంది. అందుకే ఆశ్వయుజ శుద్ధ సప్తమినాడు చదువుల తల్లిగా కొలువుదీరే దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తుంటారు.త్రిశక్తి స్వరూపిణీ నిజ స్వరూపాన్ని సాక్షత్కారింపజేస్తూ శ్వేతపద్మాన్ని అధిష్టించిన దుర్గామాత తెలుపు రంగు చీరలో బంగారు వీణ, దండ, కమండలం ధరించి అభయములతో సరస్వతీ దేవిగా భక్తులను అనుగ్రహిస్తుంది. ఈ నేపథ్యంలో నేడు అమ్మవారికి గారెలు, పూర్ణాలు నైవేధ్యంగా సమర్పిస్తారు. ఇంద్రకీలాద్రి పై శ్రీ మహాలక్ష్మీ అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకునేందుకు గురువారం రాత్రి 11గంటల సమయంలోను భారీగా భక్తులు తరలివచ్చారు. ఆదివారం కావడంతో రెండున్నర లక్షల మంది భక్తులు దర్శనానికి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రూ.100, రూ.300, రూ.500 రూపాయల దర్శనం టికెట్స్ విక్రయాలను అధికారులు నిలిపివేశారు.
నేడు సీఎం పట్టు వస్త్రాలు సమర్పణ
నవరాత్రుల్లో మూలా నక్షత్రం రోజున రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి ముఖ్యమంత్రి చేతుల మీదుగా పట్టువస్త్రాలు అందజేయడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం 3 నుంచి 3.30 గంటల మధ్య ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇంద్రకీలాద్రికి చేరుకుని రాష్ట్ర ప్రభుత్వం తరపున దుర్గమ్మకు పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో సెక్యూరిటీ సిబ్బంది దుర్గగుడి కి చేరుకుని ట్రయల్ రన్ నిర్వహించారు. భద్రతా చర్యలపై పోలీసులకు అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. మూలానక్షత్రం సందర్భంగా మూడు లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో అన్ని వీఐపీ, ప్రొటోకాల్ అంతరాలయ దర్శనాలను నిలిపివేస్తారు. కేవలం క్యూ లైన్ల ద్వారానే భక్తులంతా దర్శనాలు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.